రాజధానిపై రైతుల ఆందోళనలో తప్పులేదు.. కచ్చితంగా కోడి పందాలుంటాయ్!

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు.. వారి ఆందోళనకు ప్రజా సంఘాలు, టీడీపీ నేతలు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని మార్పుపై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమేనన్నారు. రైతన్నల ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదన్నారు.

అన్యాయం జరగదనే భావిస్తున్నా!

‘అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుంది అని చెబుతున్నారు. అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నా అభిప్రాయం. ఇంకా రాజధానిపై పూర్తిగా క్లారిటి రాలేదు. కేబినెట్‌‌లో ఆమోదం, అసెంబ్లీలో ఆమోదం జరిగితే కానీ రాజధాని మార్పుపై  స్పష్టత రాదు. అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరగదనే నేను భావిస్తున్నాను. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయి గనుక మాకు న్యాయం చేయండని రాజధాని రైతులు కోరడం తప్పేంకాదని నా వ్యక్తిగత అభిప్రాయం. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అమరావతి అభివృద్ధి ఏ మాత్రం తగ్గదు. అమరావతిలో అనుకున్నట్టుగానే లేఔట్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదివరకే చెప్పారు’ అని వైసీపీ ఎంపీ వ్యాఖ్యానించారు.

కచ్చితంగా కోడిపందాలుంటాయ్!

ఈ సందర్భంగా కోడిపందాలు గురించి మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూదానికి, హింసకు తావు లేని కోడిపందాలుటాయని ఆయన స్పష్టం చేశారు. ‘సంక్రాంతికి కచ్చితంగా జరుగుతాయి కోడిపందాలు అనేవి సంక్రాంతి పండగలో ఒక భాగం. కోడి పందాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయలలో అంతర్భాగం సంక్రాంతిని, కోడి పందాలను మన గోదావరి జిల్లాల్లో ఎవరూ విడదీయలేరు ఎవరైనా విడదీయాలని చూస్తే వారి ఆలోచనలు దెబ్బతింటాయి’ అని రఘురాం రాజు చెప్పుకొచ్చారు. కాగా.. ఈ ఎంపీ ఎన్నికల ఫలితాల నుంచి వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. అయితే జగన్ నిర్ణయాలను సైతం ఈయన తప్పుబడుతూ హాట్ టాపిక్ అవుతున్నారు.

More News

జనవరి 1న 'రాజా నరసింహా'

''అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు.

చిరంజీవి - కొరటాల చిత్రానికి భారీ ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి... ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద స‌క్సెస్‌నే సొంతం చేసుకున్నారు.

మారుతి తదుప‌రి ఆయ‌న‌తోనేనా..?

రీసెంట్‌గా విడులైన `ప్ర‌తిరోజూ పండ‌గే` చిత్రంతో ద‌ర్శ‌కుడు మారుతి సూప‌ర్‌హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

వెన్నునొప్పితో ఆస్పత్రికెళితే యువతి శరీరంలో బుల్లెట్.. అసలేం జరిగింది!?

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాకు చెందిన అస్మాబేగం అనే యువతి వెన్ను నొప్పితో నిమ్స్‌లో అడ్మిట్ అవ్వడంతో..

ప‌వ‌న్ 27వ చిత్రం.. డిఫ‌రెంట్ పాత్ర‌లో..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే రాజ‌కీయాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.