బాలయ్య, రాజశేఖర్‌ల 'విక్రమ్ వేద' పై.. 'వై నాట్' క్లారిటీ

  • IndiaGlitz, [Friday,March 22 2019]

మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తమిళ సూపర్ డూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ మూవీ మాధవన్, సేతుపతికి మంచి పేరు సంపాదించిపెట్టింది. అయితే తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ అయిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. ఇద్దరు సీనియర్ నటులు నటిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. 2017 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచి 'బాహుబలి 2' చిత్రాన్ని సైతం వెనక్కినెట్టి ఓ రేంజ్‌లో వసూళ్లు రాబట్టిందని చెప్పుకుంటూ ఉంటారు.

మొద‌ట ఇందులో నాగార్జున, వెంకటేష్, రానా, మాధవన్‌లలో ఎవరైనా ఇద్దరు నటించవచ్చని వార్తలు వచ్చాయి. ఆ త‌ర్వాత రీమేక్ చిత్రంలో విజ‌య్ సేతుపతి పాత్రలో రవితేజ, మాధవన్ పాత్రలో రానాలు నటిస్తారని అన్నారు.

తాజాగా బాల‌కృష్ణ, రాజ‌శేఖ‌ర్ పేర్లు ఫ్రేంలోకి వ‌చ్చాయి. బాల‌య్య గ్యాంగ్ స్టర్‌గా, రాజ‌శేఖర్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో క‌నిపించ‌నున్నార‌ని అని కూడా వార్తలు గుప్పుమన్నాయి. కాగా ఈ చిత్రాన్ని రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి ‘వై నాట్’ స్టూడియోస్ నిర్మిస్తోందని పుకార్లు వచ్చాయి. అయితే శుక్రవారం రోజున ఈ రీమేక్ మూవీపై స్పందించి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టడం జరిగింది.

‘వై నాట్’ రియాక్షన్ ఇదీ..

2017లో తమిళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్ వేధా’ను తెలుగులో రీమేక్ చేస్తున్నామని.. ఆ సినిమాలో నందమూరి బాలయ్య, డాక్టర్ రాజశేఖర్‌‌తో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని.. ఆ సినిమా మాను ‘వై నాట్’ నిర్మిస్తుందని ఫ్రింట్, ఆన్‌లైన్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవన్నీ అవాస్తవాలే. దయచేసి మేం అధికారికంగా ప్రకటన చేసినంత వరకు ఎలాంటి ఇలాంటి వార్తలను రాయకండి అని ‘వై నాట్’ తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

More News

తెలుగులో సాయిప‌ల్ల‌వి మ‌ల‌యాళ చిత్రం 

సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. వ‌రుస విజ‌యాల‌తో సాయిప‌ల్ల‌వి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా రాణిస్తున్నారు.

మామ బ్యాన‌ర్‌లో మెగా ప‌వ‌ర్‌..

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తొలి చిత్రం చిరుత‌త‌ను అశ్వినీద‌త్ బ్యాన‌ర్ వైజ‌యంతీ మూవీస్‌లో చేసినా.. రెండో సినిమా మ‌గ‌ధీరను అల్లు అర‌వింద్ త‌న గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చేశాడు.

కొత్త వ్యాపారంలోకి చిన్మ‌యి...

సింగర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న చిన్మ‌యి మీ టూ ఉద్య‌మంలో చురుకైన పాత్ర‌ను పోషించారు. ప్ర‌ముఖ త‌మిళ ర‌చ‌యిత వైర‌ముత్తు

లగడపాటి విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో 'ఎవడు తక్కువకాదు' 

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లు అర్జున్ ప‌వ‌ర్‌ప్యాక్డ్ ఫ‌ర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్.

40 కోట్ల కామ్రేడ్‌...

విజ‌య దేవ‌ర కొండ సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డుతున్నాయి. అర్జున్ రెడ్డి, ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత గోవిందం చిత్రాలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హీరోగా క్రేజ్‌తో పాటు బిజినెస్ ప‌రంగా మార్కెట్‌ను కూడా పెంచేశాయి.