కుర్ర హీరో అతితో మధ్యలోనే వదిలేసిన డైరెక్టర్

  • IndiaGlitz, [Thursday,January 09 2020]

సినిమా విషయంలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. దర్శకుడు చెప్పినట్టు చేయడం.. ఆయన అనుకున్నట్టుగా కథను మలచడం నటీనటుల పని. సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. అందరూ ఇదే ఫాలో అయ్యారు. డైరెక్టర్‌కు ఇచ్చే వాల్యూ అలాంటిది. కానీ కొంతమంది ఆ డైరెక్టర్ పనిలో కూడా వేలు పెడుతూ.. తమ వాల్యూను తగ్గించుకుంటుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో అక్కడక్కడా కనపడుతూనే ఉంటారు. తాజాగా ఓ కుర్ర హీరో... ఈ కోవలో చేరాడు. యూత్‌లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆ కుర్ర హీరో.. దర్శకులకు ఇబ్బందిగా మారాడాని సమాచారం. డైరెక్టర్ పనిలో ఇన్వాల్వ్ అవుతూ.. వారికి నసగా మారాడట. దీంతో చిర్రెత్తుకు వచ్చిన దర్శకులు మధ్యలోనే సినిమా వదిలేయడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది.

తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ యువహీరో నటిస్తున్న ఓ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ సినిమా డైరెక్టర్‌ చెప్పినదానికి.. ఈ హీరో గారు చేసే దానికి చాలా తేడాలు వస్తున్నాయట. ప్రతిదానికి కల్పించుకుని డైరెక్టర్‌ను పని చేసుకోనివ్వడం లేదని తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయి చేరాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తాను నటించిన సినిమా ప్లాప్ కావడంతో.. ఈ సినిమాపై మోతాదుకు మించి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇది డైరెక్టర్‌కు నచ్చడం లేదు. ఇటీవల విడుదలైన సదరు సినిమా టీజర్.. విమర్శల పాలైంది. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల పెట్టుకుని.. హీరో, డైరెక్టర్లు గొడవపడటం నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. హీరోగా చేసిన తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అలాంటి సమయంలో ఈ విధమైన బ్యాడ్ టాక్ తెచ్చుకోవడం ఆయన అభిమానులను కలవరపరుస్తోంది.

More News

ముద్దు సీన్ కోసం రెండు రోజుల ట్రైనింగ్.. రికార్డ్ బ్రేక్ చేసిన హీరోహీరోయిన్లు

లిప్ లాక్ సీన్లకు సినీ పరిశ్రమలో భలే డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు ఈ సీన్ అంటే ఆచితూచి స్పందించేవారు.

మోహన్ లాల్ సాయం తీసుకుంటున్న బన్నీ

సంక్రాంతికి సందడి చేయనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన సినిమా ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు.

మళ్లీ మొదటికొచ్చిన బోయపాటి

ఒక హీరోతో డైరెక్టర్ సినిమా చేస్తున్నాడంటే.. అతనిపై ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమాల ప్రభావం కూడా ఉంటుంది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు వంగవీటి రాధా..!? రంగంలోకి దిగినట్టేనా!

వంగవీటి రాధా.. ఈ వ్యక్తి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. అయితే రాసేటప్పుడే ఒకటికి రెండుసార్లు వార్త ఆలోచించి రాయాల్సి వస్తోంది.

చిరు సలహా: రంగమ్మత్తకు షాకిచ్చిన రాములమ్మ!

ఇదేంటి.. అసలు ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించిన యాంకర్ అనసూయకు.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ షాకివ్వడమా..?