టిఫిన్ సెంట‌ర్ ఓన‌ర్‌గా మారిన యువ హీరో

  • IndiaGlitz, [Monday,July 13 2020]

ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. తొలి చిత్రం ‘దొరసాని’లో శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌తో క‌లిసి చ‌క్క‌గా న‌టించాడు. న‌టుడిగా మంచి మార్కుల‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో రెండో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‌’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్ప‌టికే సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో సిద్ధ‌మైంది. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వినోద్ ఆనంతోజు తెర‌కెక్కించాడు. వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌.

ఈ సినిమా గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆనంద్ దేవ‌ర‌కొండ తెలియ‌జేశాడు. ఈ సినిమా కోసం ఆనంద్ దేవ‌ర‌కొండ వంట‌వాడిగా మారాడ‌ట‌. ముఖ్యంగా క‌థానుగుణంగా గుంటూరులో టిఫ‌న్ సెంట‌ర్ ఓన‌ర్‌గా కనిపిస్తాడు. అందుకోసం దోశ‌లు ఎలా చేయ‌డం, చ‌ట్నీ చేయ‌డం ఎలాగో నేర్చుకున్నాడట‌. క‌థ విన్న‌ప్పుడు తాను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి కావ‌డంతో క‌థ‌కు బాగా క‌నెక్ట్ అయ్యాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. అలాగే సినిమా కోసం గుంటూరు యాస‌ను నేర్చుకున్నాడ‌ట‌.

More News

సినిమా శాఖ‌ల్లో ఈ టీమ్ అస‌రం వ‌స్తుందా?

ఇప్ప‌టి వ‌ర‌కు 24 శాఖ‌లే సినిమాలకు ప‌నిచేస్తూ వ‌చ్చాయి. అయితే త్వ‌ర‌లోనే మ‌రో కొత్త శాఖ కూడా వీటితో జాయిన్ కానుంద‌ట‌.

అనంత పద్మనాభుని ఆలయ బాధ్యత వారిదే.. వివాదానికి చెక్ పెట్టిన సుప్రీం

కేరళలోనే ప్రఖ్యాతి చెందిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సంబంధించిన తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించింది.

రాజధానులపై అంత పట్టుదలా.. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరవద్దనేనా?

ముచ్చటగా మూడు రాజధానులు.. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ కనీవినని కాన్సెప్ట్.

కరోనా నెక్లెస్.. అరగంట వేసుకుంటే 80 శాతం వైరస్ అవుట్..

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అన్ని దేశాలూ అదే పనిలో బిజిబిజీగా ఉన్నాయి.

తెలంగాణలో మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తెలంగాణలో గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు 1800లకు పైన నమోదైన కేసులు..