నాగ్ చిత్రంలో యంగ్ మ్యూజిషియ‌న్‌

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

అక్కినేని నాగార్జున ఇప్పుడు రెండు సీక్వెల్స్‌ను సెట్స్‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. వాటిలో ముందుగా 'మ‌న్మ‌థుడు' సీక్వెల్ 'మ‌న్మ‌థుడు 2', 'సొగ్గాడే చిన్నినాయ‌నా' సీక్వెల్ 'బంగార్రాజు'. 'మ‌న్మ‌థుడు 2' ను రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ట్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా మార్చి 12 న ప్రారంభం కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా యువ సంగీత ద‌ర్శ‌కుడికి అవకాశం ఇచ్చాడ‌ట నాగార్జున‌. 'మ‌న్మ‌థుడు 2' చిత్రానికి 'ఆర్.ఎక్స్ 100' చిత్రానికి సంగీతం అందించిన చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించ‌నున్నాడ‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో ఆర్‌.ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌తో పాటు అనుష్క హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి. నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను రూపొందించ‌నున్నారు.

More News

జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరు: కిల్లి

వైసీపీలోకి రోజురోజుకు వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి

10 మందితో కేసీఆర్ ఫస్ట్ టీమ్

గులాబీ బాస్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీమ్ రెడీ అయ్యింది. 10మందితో గులాబీ బాస్ టీమ్ రెడీ అయ్యింది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 66రోజుల తర్వాత తొలి మంత్రి వర్గ విస్తరణ జరుగుతోంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రంలో అల్ల‌రి

వ‌రుస సినిమాల‌తో కామెడీ హీరోగా మెప్పించి 50 సినిమాల‌ను దాటేసిన అల్ల‌రి న‌రేష్‌.. ఈ మ‌ధ్య మంచి స‌క్సెస్ లేక‌పోవ‌డంతో స్పీడుకు బ్రేకు వేశాడు.

'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' విడుద‌ల ఎప్పుడంటే?

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవితంపై మూడు బయోపిక్స్ సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో ఒక‌టి రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

త‌మిళంలోకి అఖిల్ హీరోయిన్‌...

అఖిల్ అక్కినేని హీరోగా విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం `హ‌లో` ద్వారా తెలుగు చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టింది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ 'క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శి'.