close
Choose your channels

వైరల్: ఫ్యామిలీతో ప్యారిస్‌ టూర్.. కొడుకు అభయ్ రామ్‌ ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్

Monday, November 22, 2021 • తెలుగు Comments

వైరల్: ఫ్యామిలీతో ప్యారిస్‌ టూర్.. కొడుకు అభయ్ రామ్‌ ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్

సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా వుండే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ ఆర్ ఆర్ ఆర్’’ కోసం దాదాపు మూడేళ్లు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు జూనియర్. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో కూడా పాల్గొన్నాడు. దాదాపు మూడేళ్లకు పైగా సాగిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో ఎన్టీఆర్ చాలా అలసిపోయారు. విరామం లేని షూటింగ్ కారణంగా కుటుంబానికి కూడా ఆయన దూరమయ్యారు. దీంతో ఆయన ఫ్యామిలీ‌తో వెకేషన్ ప్లాన్ చేశారు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో పాటు ఆయన విదేశీ విహారానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్యారిస్ టూర్‌లో ఉన్నాడు. శనివారం ఉదయమే ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్‌లో దిగాడు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పిక్ షేర్ చేశాడు. తన పెద్దకుమారుడు అభయ్ రామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు. సదరు ఫోటోలో ఎన్టీఆర్… అభయ్ రామ్‌ను ముద్దాడుతుండగా… బ్యాక్‌గ్రౌండ్‌లో ప్యారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూరప్ పర్యటనలో తారక్ తన కుటుంబంతో వారం లేదా పది రోజులు గడపనున్నట్లు సమాచారం. అనంతరం భారతదేశానికి చేరుకుని .. తిరిగి సంక్రాంతి తర్వాత కొరటాల శివ సినిమాతో మళ్లీ మేకప్ వేసుకోనున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz