ఎ.పి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం యూత్ ప్లాన్..!

  • IndiaGlitz, [Monday,January 23 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొన్ని రోజులుగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు కోసం యువ‌త చేస్తున్న పోరాట స్పూర్తితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త కూడా ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాలి అని పిలుపు ఇచ్చారు ప‌వ‌ర్ స్టార్. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త ఈనెల 26న ప్ర‌త్యేక హోదా కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో పోరాటం చేసేందుకు రెడీ అవుతుంది.

ఈ పోరాటం చేసేందుకు స‌న్న‌ద్ద‌మౌతున్న యువ‌త‌ కాస్త ఆలోచించి... ఒక్క వైజాగ్ ఆర్క్ బీచ్ లోనే నిర‌స‌న తెలియ‌చేస్తే భారీగా యువ‌త త‌ర‌లి వ‌స్తే ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. అదీ కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న యువ‌త అంతా వైజాగ్ రావాలి అంటే క‌ష్టం అవుతుంది. అందుచేత బీహార్ లో నిన్న చేసిన‌ట్టుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌మంత‌టా రోడ్ షో చేస్తే బాగుంటుంది అనేది కొంత మంది ఆలోచ‌న‌. బీహార్ లో 3 కోట్ల మంది ప్ర‌జ‌లు రోడ్ షోలో పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్రదేశ్ లో ఉన్న ప్ర‌తి ఊరిలో యువ‌త రోడ్ షో స్ ఒక చైన్ లా చేస్తే యువ‌త అంతా పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌త్యేక హోదా కోసం ఆంధ్ర‌ప్రదేశ్ యువ‌త చేప‌ట్ట‌నున్న నిర‌స‌న‌ శాంతియుతంగా జ‌ర‌గాలి..కేంద్రం మ‌న‌సు క‌ర‌గాలి అని కోరుకుందాం..!

More News

తెలుగు నేలంతా నన్నుకౌగలించుకున్నంత ఉద్వేగం - క్రిష్..!

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..?ఒక దేశాన్ని గెలిచిన గర్వం...తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం..

కాటమరాయుడు టీజర్ రిలీజ్ వాయిదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం కాటమరాయుడు.

రూమర్స్ ని ఖండించిన సింగం 3..!

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3.ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని హరి తెరకెక్కించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం - పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయడం తన వాదన ఏమిటో చెప్పడం తెలిసిందే.

బ్యాంకాక్ కు మహేష్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్నసినిమా శరవేగంగా రూపొందుతోంది.