close
Choose your channels

మూడో స్థానంలో జగన్.. కేసీఆర్ ఎక్కడ?

Sunday, January 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూడో స్థానంలో జగన్.. కేసీఆర్ ఎక్కడ?

సీఎం కేసీఆర్.. తెలంగాణ పోరులో ముందు వరుసలో నిలిచారు. తెలంగాణ రావడంలో కీలకమయ్యారు. దీంతో మొదటి ఐదేళ్లు ప్రజానీకం ఆయనను గుండెల్లో పెట్టుకుంది. ఏ ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేకుండా పోయింది. కేసీఆర్ మాటలకో.. తెలంగాణపై ఉన్న మమకారానికో ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో కేసీఆర్ చెప్పిందే వేదంగా మారిపోయింది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా కేసీఆర్ మారారు. కానీ ఇది మొదటి ఆరేడేళ్లకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ వచ్చిన అనంతరం జరిగిన రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత మాత్రం ప్రజలకు మెల్లిమెల్లిగా టీఆర్ఎస్‌పై నమ్మకం సన్నగిల్లింది.

సీన్ కట్ చేస్తే ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు గాలి వీస్తోందనడానికి.. ప్రజలు కేసీఆర్‌ను విశ్వసించడం లేదనడానికి నిదర్శనమే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం. దీంతో కేసీఆర్ గ్రాఫ్ ఎక్కడికో పడిపోయింది. ఎక్కడికంటే కనీసం టాప్ టెన్‌లో కూడా కనిపించనంతగా... అవును.. టాప్ టెన్ లిస్ట్‌లో కేసీఆర్‌కు స్థానం దక్కలేదు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మాత్రం టాప్ టెన్ బెస్ట్ సీఎంల లిస్టులో మూడో స్థానం లభించింది. ఆయన చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలకు జనం నీరాజనం పలుకుతున్నారు. తండ్రి బాటలో నడుస్తూ జగన్.. ప్రజలకు చాలా చేరువవుతున్నారు. ఆయన చేట్టిన ఎన్నో పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. దీంతో ఆయన మూడో స్ఠానంలో నిలిచారు.

ఇక బీజేపీ దేశాన్ని ఏలుతుంటే ఆ పార్టీ సీఎంలు మాత్రం ప్రజారంజక పాలనను అందించడంలో విఫలమవుతున్నారు. అందుకే ఆ పార్టీకి చెందిన సీఎంలు చివరి మూడు స్థానాలకు పరిమితమయ్యారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాల్లో మాత్రం ప్రజలకు చేరువ కాలేక పోతోందని దీన్ని బట్టి తెలుస్తోంది. కాగా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలో బెస్ట్ సీఎంలలో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో ఉన్నారు. మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ‘ఏబీపీ’ న్యూస్ చేసిన ‘దేశ్ కా మూఢ్’ సర్వేలో భాగంగా బెస్ట్ సీఎంలను ఎంపిక చేసింది.

బెస్ట్‌ సీఎంలు వీరే...

1) నవీన్‌ పట్నాయక్‌-ఒడిశా
2) కేజ్రీవాల్‌-ఢిల్లీ
3) వైఎస్‌ జగన్-ఏపీ
4) విజయన్‌-కేరళ
5) ఉద్ధవ్‌ ఠాక్రే-మహారాష్ట్ర
6) భూపేశ్‌ బఘేల్‌-ఛత్తీస్‌గఢ్‌
7) మమతా బెనర్జీ-పశ్చిమబెంగాల్‌
8) శివరాజ్‌ సింగ్‌-మధ్య ప్రదేశ్‌
9) ప్రమోద్‌ సావంత్‌-గోవా
10) విజయ్‌ రూపానీ-గుజరాత్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.