జగన్ మంచి మనసే కారణం..: ‘కోడికత్తి’ కేసు నిందితుడు

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరికొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నాడు అరెస్ట్ అయిన శ్రీనివాసరావు.. 7 నెలల తర్వాత ఇవాళ ఉదయం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటంతో శ్రీనివాసరావును జైలు అధికారులు విడుదల చేశారు.

విడుదల అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి జగనన్నే కారణం. జగన్‌ది జాలి గుండె. దాడి సమయంలో నన్ను కొట్టకుండా అడ్డుకున్నారు. నేను ప్రాణాలతో ఉండడానికి కారణం జగన్ మంచి మనసే. నేను కావాలని జగన్‌పై దాడి చేయలేదు.. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధం. రైతులు, మహిళలు, ఇతర సమస్యల గురించి వైఎస్‌ జగన్‌తో మాట్లాడాలనుకున్నాను. నేనొక చెఫ్‌నని అందుకే ఆరోజు నా దగ్గర మూడు కత్తులు, ఫోర్క్ ఉన్నాయి అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.

More News

'మార్స్' పై వెళ్లేవారికి నాసా ఆహ్వానం..

ఇదేంటి.. మార్స్ పైకి వెళ్లేవారికి నాసా ఆహ్వానం పంపిందా..? అని కొంచం ఆశ్చర్యంగా ఉంది కదా? అవును మీరు వింటున్నది నిజమే.. మార్స్‌ పై వెళ్లడానికి నాసా నే స్వయాన నోటిఫికేషన్ ఇచ్చింది.

మాట నిలబెట్టుకోకుంటే నిజామాబాద్ ఎంపీగా రాజీనామా

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రబాబుకు ఆర్జీవీ బస్తీమే సవాల్.. జై జగన్!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు.

'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా

లగడపాటి రాజకీయమే కాదు.. ఇక పై సర్వే సన్యాసం కూడా!!

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికలు.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన ‘ఆర్జీప్లాష్’ టీమ్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.