జగన్‌పై హత్యాయత్నం కేసు: తీవ్ర విషమంగా నిందితుడి ఆరోగ్యం

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ అనే యువకుడు కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో జైల్లో నుంచి హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. ఇదిలా ఉంటే.. రాజమండ్రిలో వీలుకాకపోతే మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. గతంలో కూడా తన ఛాతి నొప్పి వస్తోందని.. తాను బతికలేనని.. ప్రజలతో మాట్లాడాలని ఉందని మొత్తుకున్నా పోలీసులు మాత్రం మీడియా ముందుకు రానివ్వలేదు. అయితే ఉన్నట్టుండి మంగళవారం సాయంత్రం శ్రీనివాస్ అనారోగ్యానికి గురవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజాలు బయటికి రాకుండా చేసేందుకు టీడీపీ డ్రామాలు ఆడుతోందని.. అన్యాయంగా ఓ అమాయకుడు దుష్ట రాజకీయ శక్తుల మధ్యన బలవుతున్నాడని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

 

More News

సీక్వెల్‌కు సల్మాన్ రెడీ!

తమిళ్‌లో విక్రమ్ హీరోగా బాల దర్శకత్వంలో రూపొందిన 'సేతు' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ తెలుగులో 'శేషు'గా  రీమేక్ చేశారు.

కొత్త దర్శకుడితో చరణ్

రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని పై క్లారిటీ లేదు.

లంకలో మారణహోమం మా పనే: ఐసిస్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే నాడు జరిగిన మారణహోమంలో మొత్తం 321 మంది తుదిశ్వాస విడవగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఓటిమి పై గంభీర్ ఎమోషనల్!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందింది. అయితే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిని చవిచూసింది.

దిగొచ్చిన టి. ఇంటర్ బోర్డ్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

గత వారం రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చిన్నపాటి గుడ్ న్యూస్ అందించింది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 25 వరకూ బోర్డు గడువిచ్చిన సంగతి తెలిసిందే.