close
Choose your channels

వైఎస్ జగన్ ‘బాహుబలి’.. గౌతమ్ ‘సైరా నర్సింహారెడ్డి’!

Wednesday, August 21, 2019 • తెలుగు Comments

వైఎస్ జగన్ ‘బాహుబలి’.. గౌతమ్ ‘సైరా నర్సింహారెడ్డి’!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘బాహుబలి’, మంత్రి గౌతమ్ రెడ్డి.. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి వారని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ పెద్ద పారిశ్రామికవేత్తలని... వీరిద్దరూ కలసి ఏపీకి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకొస్తారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. బుధవారం నాడు నెల్లూరు జిల్లాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో రోజా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

నిర్దేశించిన సమయంలోనే పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పైసా లంచం తీసుకోకుండానే అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమై అన్ని చోట్లా ఫిర్యాదులు వస్తున్నాయని... దీనిపై పారిశ్రామికవేత్తలు ఆలోచించాలని చెప్పారు.

Get Breaking News Alerts From IndiaGlitz