పురంధేశ్వరి‌కి జగన్ బంపరాఫర్‌..  కీలక పదవి!

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీజేపీ మహిళ నేత పురంధేశ్వరికి బంపరాఫర్ ఇచ్చారా..? ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారా..? ఈ చేరిక విషయమై ఆమె భర్త దగ్గుబాటి వెంకశ్వరరావుకు సీఎం అల్టిమేటం జారీ చేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది.

ఓడినప్పటికీ ప్రాధాన్యత.. త్వరలో ఎమ్మెల్సీ!

పూర్తి వివరాల్లోకెళితే.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. 2019 ఎన్నికలకు ముందు ఎవరూ ఊహించని విధంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీలో చేరడం.. ఆ తర్వాత అనుకున్న విధంగానే పర్చూరు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కావడం చివరి నిమిషంలో కొడుకు కాకుండా స్వయంగా దగ్గుబాటే రంగంలోకి దిగడం.. ఎన్నికల్లో ఓటమిపాలవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. అయితే.. ఆయన ఓటమిపాలైనప్పటికీ నియోజకవర్గంలో, ప్రకాశం జిల్లాలో మంచి ప్రాధాన్యతనే వైసీపీ ఇస్తోంది. అంతేకాదు.. త్వరలోనే దగ్గుబాటికి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తండ్రీ కొడుకు ఇద్దరూ వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

జగన్ బంపరాఫర్ ఇదీ..!

అయితే.. గత కొన్ని రోజులుగా చేరికలకు గేట్లెత్తేసిన వైఎస్ జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున వైసీపీ ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో పలువురు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఈ క్రమంలో పురంధేశ్వరిని వైసీపీలోకి తీసుకునేందుకు అధిష్టానం ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా దగ్గుబాటికి జగన్ కండిషన్ పెట్టారని వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంటే పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపుతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చేరిక విషయంలో దగ్గుబాటే తదుపరి నిర్ణయం తీసుకోవాలని బాలినేని ఇటీవల మీడియా మీట్‌లో పరోక్షంగా చెప్పారు.

ఏం తేల్చుతారో!?

అయితే పురందేశ్వరి జగన్ బంపరాఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేకుంటే బీజేపీలోనే కొనసాగుతారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ పురంధేశ్వరి గానీ.. దగ్గుబాటి ఫ్యామిలీ కానీ ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలకు కేంద్రంలో మంచి అవకాశాలుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారా..? లేకుంటే రాజ్యసభ సీటు దక్కుతుంది కదా అని వైసీపీ తీర్థం పుచ్చుకుంటారో తెలియాల్సి ఉంది.

More News

భార‌తీయుడు 2: ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌

శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. ప్ర‌తి సీన్‌ను తెర‌పై ఆయ‌న ఓ అద్భుతంగా ఆవిష్క‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చే్స్తుంటారు.

ఏపీ ప్రజలకు జగన్ శుభావార్త.. నవంబర్ 1 నుంచి..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి వరాలజల్లు కురిపించారు. శుక్రవారం నాడు ఆరోగ్యశాఖపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం జరిగింది.

మరోసారి అదే డైరెక్టర్ తో మహేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. అయితే మ‌హేశ్‌కి మాత్రం న‌చ్చిన ద‌ర్శ‌కులు కొంత మందే.

రామ్ ‘డబుల్’ ప్రయత్నం ఫలించేనా!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఊహించని హిట్టవ్వడంతో కుర్ర హీరో రామ్ మంచి ఊపు మీదున్నాడు.

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం..