close
Choose your channels

కొత్త మంత్రులకు జగన్ కంగ్రాట్స్.. మనమేంటో నిరూపిద్దాం!

Saturday, June 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త మంత్రులకు జగన్ కంగ్రాట్స్.. మనమేంటో నిరూపిద్దాం!

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులుగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో సహా మొత్తం 25 మంది శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ కొత్త మంత్రులందరికీ ఇప్పటికే శాఖలు కూడా కేటాయింపు జరిగింది. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ ఎవరికి ఏ శాఖ అయితే సరిగ్గా సరిపోతుందో అదే కేటాయించారు. మరీ ముఖ్యంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్‌కు మాత్రం మంచి చాలెంజింగ్ శాఖలు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని చెప్పుకోవచ్చు, మరికొందరు మంత్రుల విషయంలో అసలు ఎవరూ ఊహించని విధంగా శాఖలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు..? ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి..? అనే విషయంలో జగన్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారని.. చెప్పుకోవచ్చు.

మనమేంటో నిరూపిద్దాం!

కాగా.. బడుగు, బలహీన వర్గాల సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ.. తన కేబినెట్‌ను జగన్ రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా తన టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నా సహచరులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మనం వేసే ప్రతి అడుగూ ఏపీ ప్రజలు మేలు కోసమే అయి ఉండాలి. మనం చేసే పనితోనే మనమెంటో నిరూపిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ టు యూ" అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పలువురు ప్రముఖులు, కేబినెట్ మంత్రులు రియాక్ట్ అవ్వగా.. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.