close
Choose your channels

హిస్టరీ క్రియేట్ చేసిన వైఎస్ జగన్

Friday, May 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 'ఫ్యాన్‌' గాలి కనీవినీ ఎరుగని.. ఊహించని రీతిలో వీచింది. ఫ్యాన్ దెబ్బకు అటు సైకిల్.. ఇటు గ్లాస్ ఎక్కడెళ్లి పడ్డాయో అర్థం కానిపరిస్థితి!. సుమారు 150 అసెంబ్లీ, మొత్తం పార్లమెంట్ గెలిచే దిశగా వైసీపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత వరకూ ఈ రేంజ్‌లో సీట్లు వచ్చిన దాఖలాల్లేవ్ అని చెప్పుకోవచ్చు.

బహుశా ఈ రేంజ్‌లో సీట్లు వస్తాయని.. ఫ్యాన్ 150 స్పీడ్ మీద తిరుగుతుందని బహుశా వైఎస్ జగన్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కచ్చితంగా గెలుస్తారని అనుకుని ఉంటారేమో గానీ ఈ రేంజ్‌ను ఊహించి ఉండకపోవచ్చు. మొత్తానికి జగన్ పాదయాత్ర, నవరత్నాలు జగన్‌ను గెలిపించాయని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

కాగా.. వైసీపీ సునామికి అధికార పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తుడిచిపెట్టుకుపోయారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంనుంచి గతంలో కంటే చాలా తక్కువ మెజార్టీతో గెలుపొందారు. బాబు బావమరిది, సినీనటుడు బాలక్రిష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలుపొందారు. ఈ రెండు సీట్లు గెలవటం మినహా రాయలసీమలో ఏ స్థానంలోనూ కౌంటింగ్ మొదలైనప్పట్నుంచి టీడీపీ ముందజలో లేకపోవటం గమనార్హం.

రాష్ట్రంలో దాదాపు 150 అసెంబ్లీ స్థానాలు సాధించి టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది. రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైసీపీ విజయం సాధించి వైఎస్ చరిత్ర తిరగరాశారు. గత ఎన్నికల్లో 30 చోట్ల విజయం సాధించిన వైసీపీ ఈ సారి 19 స్థానాలు అత్యధికంగా గెలిచింది. గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన తెలుగుదేశం ఈ సారి రెండు స్ధానాలకు మాత్రమే పరిమితమవ్వడం గమనార్హం. కాగా.. గత ఎన్నికల్లో కడపలో 9స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈ సారి క్లీన్‌ స్వీప్‌చేసింది.

ఇదిలా ఉంటే.. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి ఘన విజయాన్నిఅయితే సాధించారో.. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అలాంటి చరిత్రనే సృష్టించారు.

మంత్రులుగా ఉన్న వారు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటం గమనార్హం. సో.. మొత్తానికి చూస్తే వైసీపీ విజయం.. వైఎస్ కష్టం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.