మోసం చేశాడని మంత్రి పదవి ఇవ్వని వైఎస్ జగన్!?

  • IndiaGlitz, [Friday,June 07 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎవరెవరికి మంత్రి పదవులు వరించబోతున్నాయ్..? రేపు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు..? ఇప్పటి వరకూ ఇన్ని మంత్రి వర్గ ఏర్పాటులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. మున్ముందు మరెన్ని ఊహించని ట్విస్ట్‌లు ఇస్తారో అని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ కీలక నేత ఎవరో.. ? ఆయనకు ఎందుకు మంత్రి పదవి రాలేదో ఇప్పుడు చూద్దాం.

సిక్కోలు అంటే గుర్తొచ్చేది వీళ్లే..!

శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ కీలక నేతలు ఎవరున్నారు..? అని అడిగితే వేళ్ల మీద లెక్కెట్టి చెప్పేయచ్చు. ధర్మాన ఫ్యామిలీ, తమ్మినేని సీతారాం ఫ్యామిలీ, దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఈ మూడు ఫ్యామిలీలే వైసీపీకి దన్నుగా.. జిల్లాలో అండగా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధర్మాన బ్రదర్స్ ఇద్దరికీ మంత్రి పదవులు పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ జగన్ మాత్రం సీనియర్, కీలక నేత అయిన ధర్మాన ప్రసాద్‌ను పక్కనెట్టి తమ్ముడు కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇస్తున్నట్లు తేల్చేశారట.

అసలేం జరిగింది..?

సీనియర్ నేత అయిన ధర్మానను వదిలి ఆయన తమ్ముడికి ఎందుకు మంత్రి పదవులు ఇస్తున్నట్లు అని అందరూ ఆశ్చర్యపోయారు.. ఒకింత ఆలోచనలో పడ్డారు. అయితే ఇందుకు కారుణాలు ఎన్నో ఉన్నాయట. ముఖ్యంగా.. శ్రీకాకుళం నుంచి ఎంపీగా రామ్మోహన్ నాయుడిపై పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందిన సంగతి తెలిసిందే. అయితే దువ్వాడ ఓటమి వెనుక ధర్మాన హస్తం ఉందట. ఈ విషయం ఆఖరి నిమిషంలో జగన్‌కు తెలియడంతో మోసం చేశారని గ్రహించి మంత్రి పదవి ఇవ్వలేదట.

ఇదీ అసలు కథ..

ఇందుకు కారణం ధర్మాన.. రామ్మోహన్ నాయుడు సామాజిక వర్గం ఒక్కటే కావడమేనట. అయితే దువ్వాడ.. తమ్మినేని ఇద్దరిదీ కాళింగ (బీసీ) సామాజిక వర్గం కావడమట. ధర్మాన వల్ల ఒక్క ఎంపీ సీటు పోయిందని.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ఈ విషయాలన్నీ జగన్‌కు తెలియడంతో ధర్మాన ప్రసాద్ కంటే మంచి నమ్మకస్తుడుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.

ఇది కూడా కారణమేనట..

మరీ ముఖ్యంగా రెవెన్యూ భూముల వ్యవహారాల్లో, మైనింగ్ వ్యవహారాల్లో గతంలో ధర్మాన ప్రసాదరావుపై విపరీతమైన విమర్శలు వచ్చాయని.. అంతేకాదు విచారణలు కూడా జరగడంతో ఏమీ లేనప్పుడే ఈ రేంజ్‌లో చెలరేగిన ధర్మాన.. మంత్రి పదవి ఇస్తే పరిస్థితి ఇక మామూలుగా ఉండదని భావించిన అధిష్టానం ఆయనకు కాకుండా ఆయన తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాలని భావించిందట. అయితే ఆఖరి నిమిషంలో జగన్ మనసు మార్చుకుని ధర్మానకే మంత్రి పదవి ఇస్తారా లేకుంటే కృష్ణదాస్‌కు ఇస్తారా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

'ప్రేమ‌జంట‌' సెన్సార్ పూర్తి.. జూన్ 28న గ్రాండ్ రిలీజ్‌

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`.

సాగర్ మంచి హీరోగా ఎదగాలి : వి.వి.వినాయక్

సమరం చాలా పెద్ద హిట్ అయి సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను... సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో 'నేనే కేడీ నెం-1'

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం`1’.

జగన్ కేబినెట్‌‌లో మంత్రులు 25మంది కాదు.. 100!

ఇదేంటి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 25 మంది ఇంకా ఎక్కువంటే మరో 5 కలిపి మొత్తం 30 వరకు మాత్రమే ఉంటాయ్.. కదా? 100 మంది ఎలా ఉంటారని ఆశ్చర్యపోతున్నారా..?

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి... జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ "ఐ లవ్ యు"

కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు.