close
Choose your channels

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Thursday, December 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం అదే పేరుతో ‘దిశ చట్టం’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చట్టం పకడ్బందీ అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దిశ చట్టం అమలుపై.. గురువారం నాడు అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని, కోర్టుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సూచించారు. 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో వన్‌స్టాప్‌ సెంటర్లు!

‘పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మరో రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. విశాఖ, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో 176 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలి. మహిళా పోలీస్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు సపోర్టు సిబ్బంది ఏర్పాటు అంగీకరిస్తున్నాం. ప్రతి జిల్లాలో వన్‌స్టాప్‌ సెంటర్లను బలోపేతం చేయాలి.. వన్‌స్టాప్‌ సెంటర్లలో ఒక మహిళా ఎస్‌ని నియమించాలి. అదే విధంగా దిశ యాప్‌ కూడా రూపొందించాలి. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్‌ చేయాలి’ అని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు.

పేదవాడి సొంతింటి కల నిజం కావాలి!

పేదవాడి సొంతింటి కల సహకారానికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల్లో అర్హుల గుర్తింపు, నిర్ణిత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.