తండ్రి బాటలో వైఎస్ జగన్.. ఫిబ్రవరి 1 నుంచి..!!

‘ప్రజా సంకల్ప యాత్ర’ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్ జగన్.. మరోసారి గ్రామాల బాట పట్టనున్నారా..? ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో జగన్ నడవనున్నారా..? ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల బాట పట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అసలు జగన్ గ్రామాల బాట ఎందుకు పట్టాలనుకుంటున్నారు..? అనే విషయం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

రూట్ మ్యాప్ సిద్ధం!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తండ్రి ఎక్కడయితే తన పయనాన్ని ఆపేశారో అక్కడ్నుంచి మొదలు పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి గ్రామాల్లో పర్యటించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు, పనితీరు, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక తీరును ప్రజల అభిప్రాయాలను సీఎం నేరుగా తెలుసుకోనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా.. పాదయాత్రకు రూట్ మ్యాప్ మొదలుకుని ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా జగన్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చూసుకునే తలశిల రఘురామే.. ఇప్పుడు కూడా రూట్ మ్యాప్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా.. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై శుక్రవారం నాడు సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.

నాడు వైఎస్సార్!

కాగా.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా రచ్చబండ పథకానికి శ్రీకారం చుట్టి.. ప్రభుత్వ పథకాలపై ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నారు? ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి..? అనే విషయాలను తెలుసుకోవడానికి నేరుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ ప్రారంభించేందుకు చిత్తూరు జిల్లాలో ప్రారంభించేందుకు బయలుదేరి మార్గమధ్యంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

More News

`RRR` ఫైనాన్సియ‌ర్ ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి`

ఫృథ్వీ సరస సంభాషణ ఎఫెక్ట్ : కీలక నిర్ణయం!

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ ఓ ఉద్యోగినితో ఆయన జరుపుతున్న సరస సంభాషణ ఆడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

చైనాను వణికిస్తున్న పాములు

‘కరోనా’.. ఈ మూడు అక్షరాల పేరుగల వైరస్ పేరు వింటుంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు..

మండలి’ రద్దు చేస్తే.. ఈ మంత్రుల సంగతేంటి జగన్..!?

శాసన మండలి రద్దు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురు!

సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయమై ప్రతి శుక్రవారం వైఎస్ జగన్..