close
Choose your channels

వాలంటీర్లు, ఎమ్మెల్యేలకు వార్నింగ్.. టీడీపీ కార్యకర్తలకు జగన్ గుడ్ న్యూస్!

Monday, June 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాలంటీర్లు, ఎమ్మెల్యేలకు వార్నింగ్.. టీడీపీ కార్యకర్తలకు జగన్ గుడ్ న్యూస్!

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు అమరావతిలోని ‘ప్రజావేదిక’లో కలెక్టర్ల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ భవిష్యత్‌ ప్రణాళికను వివరించారు. మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని ప్రతి క్షణం గుర్తుండాలన్నారు. ప్రతి కలెక్టర్, సెక్రటరీ, మంత్రి దగ్గర మేనిఫెస్టో కాపీ ఉండాలన్నారు. ‘మేనిఫెస్టో’ అనే పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో పరిపాలన సాగుతున్న పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాలని.. అందులోని అంశాలను అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మకంతో ఓట్లు వేశారన్నారు.

చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా..

"మన ప్రభుత్వంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం. మీ పదవుల్లో కూర్చోవడానికి నా ద్వారా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు.అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలకు మనం దగ్గరవుతాం. రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 151 ఎమ్మెల్యేలు,22 ఎంపీలను ప్రజలు మనకు ఇచ్చారు. 50 శాతం ఓట్ల శాతం రావడం చరిత్ర. ప్రజలను ఎప్పడూ కూడా మనం మరిచిపోకూడదు.చ్రరితలో ఎన్నడూ లేని విజయం ప్రజలు అందించారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం పూర్తిచేయాలి. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి అంశం చేశామని ఓట్లు అడగాలి" అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఎవరూ మరవకూడదు..!

"ప్రజాస్వామ్యంలో మనం ఉన్నవనే సంగతి ఎవరూ మరిచిపోకూడదు. ఎమ్మెల్యేలు, ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. 2 లక్షల మంది ఓటు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయిరన్న సంగతి మరిచిపోకూడదు. ఎమ్మెల్యేలు అవీనితి, దోచుకోవడం చేస్తే ఎంతటి పెద్దవారయిన గాని, ఏస్థాయిలో ఉన్న వారినైనా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే రెండో కన్ను అధికారులు. ఇద్దరు ఒక్కటయితే ప్రజలకు మేలు జరుగుతుంది. రైతు,పేద,అట్టడుగు వర్గాలను మరిచిపోకూడదు. శాచునేషన్‌ పద్దతిలో ప్రతి అర్హుడికి అందాలి. వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. అణగారిన వర్గాలు ఆర్థికంగాఎదగాలి. మేనిఫెస్టోలో ప్రతి అంశం కూడా పేద, రైతు, అణగారిన వర్గాలకు అందాలి.. వారు బాగుపడాలి. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒకరికి నవరత్నాలు చేరాలి. మనకు ఓట్లు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి సంక్షేమం అందాలి. ఎన్నికలయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికల అయిన తర్వాత అందరూ మనవాళ్లే" అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా తెలిపారు.

వాలంటీర్లుకు వార్నింగ్..

"శాచునేషన్‌ పద్దతిలో వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం గ్రామ వాల్లంటీర్లు, సెక్రటరీలను తీసుకురావాలి ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ను నియమించడం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశాం. ప్రతి ప్రభుత్వ పథకం డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడకూడదు. ప్రభుత్వం యంత్రాంగం నిజాయతీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి దాకా అనినీతి ఉండకూడదు. పారదర్శక ప్రతి అడుగులో కనిపించాలి. చెడు పోయిన వ్యవస్థ మారాలని చెప్పి ఎన్నికల సమయంలో ప్రతి సభలోనూ మాట్లాడాను. అవినీతి అనేది ఎక్కడ ఉండకూడదు. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే మరుక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తాం" అని జగన్ ముందస్తుగా హెచ్చరించారు.

అవినీతికి పాల్పడితే అంతే..!

"ఎమ్మెల్యేలు అక్రమాలకు గానీ, దోపిడీలకు గానీ పాల్పడితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉండదు. ఎంతటి పెద్దవాడైనా గానీ, ఏ స్థాయిలో అయినా ఉండనీ ప్రభుత్వం ఉపేక్షించదు. దేశ మొత్తం మన వైపు చూడాలి. ఇంత బాగా పనిచేస్తుందని మిగిలిన చోట్ల అనుసరించాలి. ప్రజల హక్కుగా అందించాల్సిన సేవలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి రాకూడదు. ప్రజలు ఆఫీసులు చుట్టూ చెప్పులు ఆరిగిపోయేవిధంగా తిరిగే పరిస్థితి రాకూడదు. మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి ఉండగా ప్రజలకు ఏమి కావాలన్నా కూడా వారు లంచాలు ఇచ్చే పరిస్థితి నుంచి బయటకురావాలి. వారు ఆఫీసులు చుట్టూ చెప్పుడు అరిగే పరిస్థితి రాకూడదు. ఏపీలో ఇసుక మాఫియా ఉండకూడదు. పేకాట క్లబ్బులను ప్రోత్సహించొద్దు. గ్రామస్థాయి నుంచి మార్పు తీసుకురావాలి. కాంట్రాక్టర్లకు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇరిగేషన్, రోడ్లు, సచివాలయ నిర్మాణాలు ప్రతి చోట అవీనీతి జరిగింది. పార్శదర్శకంగా మార్పుకోసం పైస్థాయి నుంచి మొదలు పెట్టాం. ఎక్కడా తప్పు జరిగిందనేది గుర్తించాం. త్వరలోనే చర్యలు ఉంటాయి" అని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.

టీడీపీ కార్యకర్తలకూ శుభవార్త!

కాగా.. గత ప్రభుత్వంలో చాలా వరకు టీడీపీ కార్యకర్తలకే న్యాయం జరిగిందని.. వైసీపీ కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు ఉంది. అయితే వైఎస్ జగన్ మాత్రం ఆ అపవాదు తన ప్రభుత్వంపై పడకూడదని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. మేనిఫెస్టోలో ప్రతి అంశం కూడా పేద, రైతు, అణగారిన వర్గాలకు అందాలని జగన్ నిర్ణయించడం.. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒకరికి నవరత్నాలు చేరాలని చెప్పడం.. మరీ ముఖ్యంగా మనకు ఓట్లు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి సంక్షేమం అందేలా అధికారులు చూడాలన్నారు. ఎన్నికలయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికల అయిన తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ చెప్పడం.. ఇది ఒకింత టీడీపీ కార్యకర్తలకు శుభవార్తేనని విమర్శకులు, విశ్లేషకులు చెబుతున్నారు. సో.. ఇది మాటలకే పరిమితం అవుతుందా..? ఆచరణలోకి వస్తుందా..? అనేది తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.