ఏపీలో భారీగా ఐఏఎస్‌ లను బదిలీ చేసిన జగన్ సర్కార్

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తనదైన మార్క్‌ని చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచిన నాడే.. ఆర్నెళ్ల నుంచి ఏడాది మధ్యలో తానేంటో చూపిస్తానని.. సుపరిపాలన, అవినీతిలేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని చెప్పిన వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు.. ప్రమోషన్స్‌ చేసిన జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీలు చేసింది. మొత్తం 22 మంది ఐఏఎస్‌లకుపైగా స్థాన చలనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఒకేసారి 22 మంది ఐఏఎస్‌లు ఇలా బదిలీ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో బహుశా ఇదే ఫస్ట్ టైమ్ అని నిపుణులు చెబుతున్నారు.

ఎవరెవరు బదిలీ అయ్యారు..!?

ఏపీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ జనరల్‌- కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి

ఇంటర్‌విద్యాశాఖ కమిషనర్‌- కాంతిలాల్ దండే

జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సింది- కన్నబాబుకు

పంచాయతీరాజ్‌ కమిషనర్‌- గిరిజాశంకర్

జీఏడీ- రంజిత్‌బాషా

రవాణాశాఖ కమిషనర్‌- సీతారామాంజనేయులు

సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌- కె.హర్షవర్దన్‌

వ్యవసాయశాఖ కమిషనర్‌- ప్రవీణ్‌కుమార్

సీఎం ఓఎస్‌డీ- జె.మురళి

సీఆర్డీఏ అదనపు కమిషనర్‌- కె.విజయ

ఉద్యానశాఖ కమిషనర్‌- చిరంజీవి చౌదరి

ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- జేఎస్‌వీ ప్రసాద్

అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- నీరబ్‌కుమార్ ప్రసాద్

జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- ఆదిత్యనాథ్ దాస్

వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి- పూనం మాలకొండయ్య

బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- కరికాల వలెవన్

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి- కే.ఎస్‌.జవహర్‌రెడ్డి

గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి- జి.అనంతరాము

యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి- కె.ప్రవీణ్‌కుమార్

జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా అజయ్‌ జైన్‌- ఆదేశం

జీఏడీ రాజకీయ ముఖ్య కార్యదర్శి- ఆర్‌పి.సోసిడియా

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి- బి.రాజశేఖర్

ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి- ఎం.టి.కృష్ణబాబు

మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి- కె.దమయంతి

సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి- ముకేష్‌కుమార్ మీనా

జెన్‌కో, ఇంధనం, మౌలికవనరులశాఖ ఎండీ- బి.శ్రీధర్‌తో పాటు జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా కె.విజయానంద్‌కు ఆదేశాలు అందాయి. కాగా ఈ టెర్మ్‌లో శ్రీలక్ష్మికి బెర్త్ కన్ఫామ్ కాలేదు. శ్రీలక్ష్మితో పాటు పలువురు ఉన్నతాధికారులు జగన్ కేబినెట్‌లో పనిచేయాలని ఆశించగా.. వారికి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగ్‌లు దక్కకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారు.