మందుబాబులకు మరో షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ.. ముందుకు కదులుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం విషయాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. దశల వారీగా మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ వస్తామని ప్రతిపక్షనేతగా ‘ప్రజా సంకల్పయాత్ర’ వైఎస్ జగన్ ఆనాడే చెప్పిన విషయం విదితమే. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత జగన్.. అందుకనుగుణంగా లిక్కర్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతూ.. రాష్ట్రంలో బెల్టు షాపులే ఉండొద్దని ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో బెల్ట్ షాపులు ఎక్కడా కనిపించలేదు.

ఇప్పటికే రేట్లు పెంచి షాకిచ్చిన జగన్!.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కేంద్రం 3.0లో పలు సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏపీలో మాత్రం మొదటి రోజు 25 శాతం రేట్లు పెంచగా.. రెండో రోజు మాత్రం ఏకంగా 50 శాతం రేట్లు పెంచేశారు. అలా మొత్తం 75 శాతం రేట్లు పెంచేసిన జగన్.. మందుబాబులకు ఊహించని షాకిచ్చారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మద్యం షాపులు మందుబాబులు లేక వెలవెలబోతున్నాయి.

అమ్మకాలు పడిపోతున్నాయ్..

మునుపటికీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. రోజురోజుకూ మద్యం అమ్మకాలు పడిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు, తగ్గిన షాపులే కారణమని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. లాక్‌డౌన్‌ తర్వాత పునఃప్రారంభమైన తొలి రోజు రూ.68కోట్లు, రెండోరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవడంతో రూ.28కోట్లు, మూడోరోజు మాత్రం రూ.47కోట్లు, నాలుగోరోజు రూ.39కోట్లు, ఐదోరోజు రూ.38కోట్లు ఆదాయం రావడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇందుకు కారణం ఇలా ఈ రేంజ్‌లో ధరల పెంచడంతో సరిహద్దు గ్రామాలకు తెలంగాణ నుంచి మందుబాబులు తెచ్చుకుంటున్నట్లు తెలియవచ్చింది. అంతేకాదు.. జగన్ సర్కార్ ఇచ్చిన షాక్‌ ఇవ్వడంతో గ్రామీణులు నాటుసారాకు అలవాటు పడుతున్నారని ఎక్సైజ్ శాఖ తెలుసుకుని నాటుసారా, గుడుంబాను అరికట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఇదే జరిగితే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో నో గుడుంబా, నో లిక్కర్ అన్న మాట.

తాజాగా మరో కీలక నిర్ణయం..

తాజాగా మద్యపాన నిషేధంలో భాగంగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలు మరో 13శాతం తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు 4,380 నుంచి 2,394 తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నెలాఖరుకు 2,394 మద్యం దుకాణాలే పనిచేస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. మిగతా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఎక్సైజ్ రీటైల్ ట్యాక్స్ పేరుతో ధరలు పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే 43వేల బెల్ట్ షాపులు తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక వ్యక్తికి బీర్లు, మద్యం విక్రయాలను 3 సీసాలకే పరిమతం చేసింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములను తొలగించినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అంతేకాదు.. విక్రయ సమయాన్ని కూడా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. బార్లను 40 శాతం మేర కుదించి 530కు తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది.

60శాతం బీర్లు అమ్మకాలు తగ్గాయ్..

అంతేకాదు.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం బీర్లు అమ్మకాలు తగ్గాయని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఇటీవలే మీడియాకు వెల్లడించారు. మొత్తానికి చూస్తే.. మద్యం నియంత్రణలో జగన్ సర్కార్ మాత్రం సక్సెస్ అవుతోందని చెబుతోంది. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.

More News

ముగ్గురు హీరోయిన్స్‌తో శ‌ర్వానంద్‌!!

జాను సినిమా ప్లాప్ త‌ర్వాత శ‌ర్వానంద్ త‌దుప‌రి సినిమా శ్రీకారం సినిమాను పూర్తి చేసే ప‌నిలోఉండ‌గానే క‌రోనా ఎఫెక్ట్ వ‌చ్చింది. దీంతో శ్రీకారం సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది.

బాలీవుడ్ హీరోల‌కు షాకిచ్చిన ప్ర‌భాస్‌

సినిమా రంగంలో అనుకోని విష‌యాలు జ‌రుగుతుంటాయి. వెండితెర‌పై పెద్ద‌గా ప్ర‌ద‌ర్శితం కానీ సినిమాలు బుల్లితెర‌పై మాత్రం ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంటాయి.

విజ‌య్ సేతుప‌తిపై హిందూ సంఘాల ఆగ్ర‌హం

త‌మిళ ప్రేక్ష‌కుల‌కే కాదు.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి సుప‌రిచితుడే. ఇప్పుడు ఈ వైర‌టీ న‌టుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వెంక‌టేశ్‌తో వెబ్ సిరీస్‌..!!

ఇప్పుడు సిల్వ‌ర్‌స్క్రీన్‌కు స‌మానంగా డిజిట‌ల్ మీడియం శ‌ర‌వేగంగా అభివృద్ధి అవుతున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువైంది. దీంతో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో అంద‌రికీ

ప్ర‌మాదం నుండి త‌ప్పుకున్న రానా

రానా క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రాల్లో ‘విరాట‌ప‌ర్వం’ ఒక