close
Choose your channels

వైఎస్ జగన్ రాజకీయ వారసుడెవరో తెలిసిపోయిందిగా..!?

Friday, July 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ జగన్ రాజకీయ వారసుడెవరో తెలిసిపోయిందిగా..!?

2019 ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది నోట వినిపించిన మాట వైఎస్ జగన్ వారసుడెవరు..? ఎవర్ని రాజకీయ వారసుడిగా జగన్ ప్రకటిస్తారు..? జగన్‌కు ఉన్నది ఇద్దరూ కూతుళ్లే కదా..? మరి ఎవర్ని ప్రకటిస్తారో..? అనేది అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే ఆ వారసుడెవరో తెలిసిపోయిందంటూ వైసీపీ వీరాభిమానులు సోషల్ మీడియాలో తేల్చేస్తున్నారు. ఇంతకీ ఆ వారసుడెవరు..? అనే విషయం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

దివంగత మఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడులకను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, అనుచరులు, వైసీపీ కార్యకర్తలు జరుపుకున్న విషయం విదితమే. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌కు పూలమాలలు వేసి నివాళులు అర్పించి తీవ్ర భావోద్వగానికి లోనయ్యారు. అయితే ఇక్కడో ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైఎస్ జగన్‌‌కు పక్కపక్కనే వైయస్ షర్మిల అనిల్ దంపతుల వారసుడు రాజారెడ్డి కూర్చున్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తుతో మంచి ఫిట్నెస్‌తో బాలీవుడ్ హీరోని తలపించేలా కనిపించడంతో అంతా ఆయనపైనే అందరి దృష్టి పడింది. ఆ కుర్రాడిని చూసిన అక్కడికొచ్చిన జనం అంతా అచ్చం రాజారెడ్డిని చూసినట్లుగానే ఉందని అన్నారు.

వాస్తవానికి రాజారెడ్డి మూలంగానే వైఎస్సార్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ అనంతరం జగన్ రాజకీయాల్లో కీలకమయ్యారు. తండ్రి అడుగు జాడల్లోనే నడిచిన ఆయన.. సీఎం పీఠాన్ని అధిరోహించి అచ్చం ఆయన్ను గుర్తుకుతెచ్చుకునేలా పాలనసాగిస్తున్నారు. అయితే రాజారెడ్డి మరణం తర్వాత ఆయన్ను ఎవరూ మరిచిపోకుండా ఉండాలని షర్మిల తన కుమారుడికి తాతయ్య పేరు పెట్టారు. అంతేకాదు.. తన తాతయ్యపేరు వైయస్ షర్మిల తనయుడుకు పెట్టడంతో జగన్ తన మేనల్లుడుపై ప్రత్యేక ప్రేమ చూపించేవారట.. ఇప్పట్నుంచే రాజకీయ మెలుకువలు నేర్పిస్తున్నారట. టైమ్ దొరికితే చాలు ఎక్కువగా రాజారెడ్డితోనే జగన్ గడిపేవారట.

అతి త్వరలోనే వైఎస్ జగన్‌ తన రాజకీయ వారసుడిగా రాజారెడ్డిని ప్రకటించబోతున్నారని వైసీపీ వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇందుకు కారణం సీఎం జగన్‌కు కుమారులు లేరు.. ఇద్దరు కుమార్తెలే కావడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది. ఈ ప్రకటన అతి త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పట్నుంచే తన మేనమామ హావాభావాలు.. స్పీచ్.. రాజకీయ మెలుకువలన్నీ షర్మిళతో పాటు ఓ పెద్ద మనిషి దగ్గరుండి నేర్పిస్తున్నారని సమాచారం.

కాగా.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా రాజారెడ్డిని ఇప్పట్నుంచే మంచిగా ట్రైన్ చేసి రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. అయితే ఈ ప్రకటన ఎప్పుడు ఉంటుందో.. అసలు ఈ పుకార్లలో ఎంత నిజం ఉందో.. అనేది తెలియాలంటే జగన్ నోటి నుంచి రాజారెడ్డి మాట ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.