మహేశ్ బాబుకు వైఎస్ జగన్ సాయం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీరాభిమానులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 11న అనగా ఎల్లుండి విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నిర్మాత అనిల్ సుంకర లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం.. అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక ప్రదర్శనలు వేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఆరు రోజుల పాటు స్పెషల్ షోలు వేసుకోవచ్చన్న మాట.

వాస్తవానికి మహేశ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే.. అలాంటిది స్పెషల్ షోలు కూడా ఉంటాయంటే సంక్రాంతి పండుగ అభిమానులకు మూడ్రోజుల ముందే వచ్చేసినట్లే. ఈ ప్రత్యేక షోల వల్ల కాసుల వర్షం మరింత ఎక్కువగా కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి చూస్తే మహేశ్ బాబుకు‌ పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డి సాయం చేస్తున్నారని వైసీపీ కమ్ సూపర్‌స్టార్ వీరాభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

More News

'శివ 143' మూవీ సాంగ్ లాంచ్ చేసిన జె.డి.చక్రవర్తి

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్)

'ఎంత మంచివాడ‌వురా'తో నా కోరిక తీరింది - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో

దాడులు చేస్తే ఊరుకోం.. అన్నీ చోట్లా వైసీపీదే గెలుపు!!

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డిపై దాడితో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

మెగాస్టార్ ఊ అంటే నేను రెడీ : అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లో వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరీ ముఖ్యంగా విభిన్నమైన కథలను ఎంచుకోవడం..

‘ఎవర్నీ వదలం.. బ్రేకుల్లేని బస్సులో పాక్‌ పంపుతాం’

భారతదేశ లౌకిక తత్వం, రాజ్యాంగ విలువల పరి రక్షణకు ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.