ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ మోదీకి జగన్ లేఖ..

గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సినీ, రాజకీయ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికు మద్దతుగా నిలిచారు. బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. పలు భాషల్లో బాలు పాడిన పాటలు, ఆయన పొందిన పురస్కారాలు వంటి విషయాలను జగన్ లేఖలో ప్రస్తావించారు.

ఎస్పీ బాలు ఎంతో మంది వర్ధమాన గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారని.. 50 ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించారని జగన్ లేఖలో పేర్కొన్నారు. మాతృభాషతో పాటు పలు భాషల్లో 40 వేలకు పైగా గీతాలను ఆలపించారని తెలిపారు. ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందారన్నారు. బాలు..25 నంది అవార్డులతో పాటు.. భారత ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ వంటి పురస్కారాలను పొందారని జగన్ లేఖలో వెల్లడించారు.

ఇప్పటికే ప్రముఖ నేపథ్య గాయకులయిన లతా మంగేష్కర్, భుపెన్ హజారిక, ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ, బిస్మిల్లా ఖాన్, భీమ్‌సేన్ జోషిలకు భారతరత్న అవార్డులు భారత ప్రభుత్వం అందజేసిందని జగన్ పేర్కొన్నారు. వారితో పాటు ప్రజానీకాన్ని ఐదు దశాబ్ధాల పాటు గాయకుడిగా అలరించిన బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని లేఖలో జగన్ వివరించారు. మరి జగన్ లేఖపై మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

‘ఆర్ఆర్ఆర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

స్పీడు పెంచ‌మంటున్న మ‌హేశ్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్..ఈ ఏడాది స‌ర్కారువారి పాట‌తో సూప‌ర్‌హిట్ అందుకున్నారు.

'పరిగెత్తు పరిగెత్తు' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల!

ఎన్. ఎస్.  సినీ ఫ్లిక్స్  బ్యానర్ పై  సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లు గా రామకృష్ణ తోట  దర్శకత్వంలో

విచారణలో దీపిక కన్నీళ్లు.. ఎమోషనల్ డ్రామా కట్టిబెట్టమన్న ఎన్సీబీ!

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణను తొలుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,

హేమంత్‌ది పరువు హత్యేనని తేల్చిన పోలీసులు

హేమంత్ మర్డర్ కేసును అన్ని రకాలుగా విచారించిన మీదట అతనిది పరువు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.