close
Choose your channels

డిపాజిట్లు రావని పవన్‌కు భయం: వైఎస్ జగన్

Sunday, March 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డిపాజిట్లు రావని పవన్‌కు భయం: వైఎస్ జగన్

నేరుగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్లు రావని జనసేన అధినేత పవన్‌‌కు భయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆదివారం నాడు చిలకలూరిపేట, రేపల్లెలో వైఎస్‌ జగన్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పవన్‌, చంద్రబాబుపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామన్నారు. కాగా ఇంత వరకూ వైసీపీపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ జగన్ పెద్దగా పట్టించుకోలేదు.. అయితే గుంటూరు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్‌కు జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

బాబు చూపించని సినిమా లేదు..

"చంద్రబాబు చేయని మోసం లేదు..చెప్పని అబద్ధం లేదు. చంద్రబాబు చూపించని సినిమా లేదు. ధర్మం.. అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారు. అభివృద్ధిపై ఎన్నికలు జరిగితే డిపాజిట్లు రావని చంద్రబాబుకు తెలుసు. అన్యాయాలు, దుర్మార్గాలు, మోసాలపై చర్చల జరగకూడదని.. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాలి" అని జగన్ పిలుపునిచ్చారు.

పవన్ పార్టీకి ప్రొడ్యూసర్..!

"చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్‌కు చేరాయి. మా చిన్నాన్నను చంద్రబాబు చంపించారు. తన పోలీసులతోనే విచారణ చేయిస్తారు. చంద్రబాబు పార్ట్‌నర్‌ ఓ యాక్టర్‌. చంద్రబాబు చెప్పిందే ఆ యాక్టర్‌ వల్లిస్తాడు. చంద్రబాబు చెప్పినవాళ్లకే యాక్టర్‌ టికెట్లు ఇస్తున్నాడు. జనసేన అభ్యర్థుల నామినేషన్లలో టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. నేరుగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్లు రావని పవన్‌ భయం. చంద్రబాబుకి మేలు చేయడానికి కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అన్ని పార్టీలకు చంద్రబాబు ప్రొడ్యూసర్‌గా మారాడు.

20రోజుల్లో వైసీపీ ప్రభుత్వం..

"మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీలేదు. ఈ ఐదేళ్లలో ఆక్వా రైతులు నష్టాలపాలయ్యారు. ఆక్వా రైతులను దళారులు దోచుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు నష్టం, కష్టం. పాదయాత్రలో రైతుల కష్టాలు దగ్గర నుంచి చూశాను. రైతులకు సబ్సిడీలేదు, బీమా లేదు, పెట్టుబడి సాయంలేదు. రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారు. రైతుల బాధలను పట్టించుకునే నాధుడే లేడు. దిగుబడి వచ్చే సమయంలో ధరలు తగ్గుతున్నాయి. రైతుల పరిస్థితి కరుగుతున్న కొవ్వొత్తిలా తయారైంది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తాం. రైతు మరణిస్తే వైఎస్‌ బీమా ద్వారా రూ.7లక్షలు ఇస్తాం. ట్రాక్టర్లకు రోడ్డు, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు ఆశపడి మోసపోవద్దు. 20రోజుల్లో వైసీపీ ప్రభుత్వం రాబోతోంది" అని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా జగన్ సూచించారు. జగన్ ఈ మాటలు మాట్లాడుతుండగా సీఎం.. సీఎం.. ఏపీకి కాబోయే సీఎం అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.