ప్రజావేదిక అక్రమ నిర్మాణం.. ఎల్లుండి కూల్చేస్తాం!

  • IndiaGlitz, [Monday,June 24 2019]

‘ప్రజావేదిక’ ఈ పేరు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువ సార్లు వార్తల్లో వినిపించిన పేరు. ఈ భవనాన్ని తమకు కేటాయించాలని టీడీపీ.. కుదరదని అధికార పార్టీ.. అక్రమ నిర్మాణాలేమీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు కరకట్టపై ఉండే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం అక్రమంగా నిర్మించినట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూల్చిపడేస్తామని జగన్ సర్కార్ తేల్చిచెప్పింది. అన్నట్లుగానే ఇప్పటికే ఈ ప్రజావేదికపై కమిటీ ఇచ్చిన నివేదికలో అక్రమ నిర్మాణం అని తేలింది. దీంతో ఈ నిర్మాణాన్ని కూల్చడానికి వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.

ప్రజావేదిక అక్రమ నిర్మాణం.. ఎల్లుండి కూల్చేస్తాం!

సోమవారం నాడు ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజావేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నామని.. ఇది అవినీతితో కట్టిన భవనం అని అన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చోనున్నామన్నారు. అక్రమ కట్టడాల తొలగింపును ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజావేదిక అన్నది అవినీతితో కట్టిన అక్రమ నిర్మాణం. రేపు పొద్దున ఈ తప్పును మరొకరు చేయకుండా మేం ఆదర్శంగా నిలుస్తాం. అందుకోసం ప్రజావేదికను ఎల్లుండి నుంచి కూలగొడతాం. ఎవరైనా సామాన్యులు ఇలాంటి బిల్డింగ్‌ను కట్టి ఉంటే ఇప్పటికే తొలగించేవాళ్లు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధగా అనిపించదా?. మన ప్రవర్తన ఎలా ఉండాలని తెలిపేందుకే ఇక్కడకు పిలిచాను. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్‌. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు కానుంది అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఉద్దేశపూర్వకంగానే...!

మనం కూర్చున్న ఈ బిల్డింగ్ చట్టబద్ధమయినదేనా? దీన్ని నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్దంగా, అవినీతి సొమ్ముతో కట్టారు. ఓ ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది అధికారులం ఇల్లీగల్ అని తెలిసీ సమావేశం జరుపుకుంటున్నాం. గరిష్ట వరద వస్తే ఇది మునిగిపోతుంది అని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఈ లేఖను ఇచ్చారు. అందువల్లే అనుమతిని జారీచేయలేము. అయినా టెండర్ అంచనాలను రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచి నిర్మించారు. ఇందుకోసం ఇద్దరు బిడ్డర్లు రాగా, ఒకరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారు. ఇలాంటివి ఉపేక్షించేది లేద‌ు అని వైఎస్ హెచ్చ‌రించారు. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

అందమైన ఆదివారం మెగా హీరోలు కలుసుకున్న వేళ..!

అవును.. మెగా హీరోలందరూ చాలా గ్యాప్ తర్వాత లవ్లీ సండే నాడు కలుసుకున్నారు. ఈ కలయికకు సాయిధరమ్ తేజ్ ఇళ్లు వేదికైంది.

'జైసేన' మొదటి పాట 'యుద్ధం చెయ్' విడుదల

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వి , ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో

సీరియ‌స్ కిస్స‌ర్‌తో పూజా హెగ్డే

పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న అడిపాడుతుంది. కెరీర్ ప్రారంభంలో `మొహంజ‌దారో`

దిమ్మ తిరిగే రేంజ్‌లో బిగ్‌బాస్ రెమ్యున‌రేష‌న్‌

ఒక్కొక్క సినిమాకే మ‌న టాలీవుడ్ స్టార్‌ హీరోల రెమ్యున‌రేష‌న్ పాతిక కోట్లు దాట‌డం లేదు. అలా దాటితేనే అబ్బో అని అనేస్తున్నారు.

సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకత్వంలో, బన్ని వాస్ నిర్మాతగా 'ప్రతిరోజు పండగే' ఘనంగా ప్రారంభం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా,