close
Choose your channels

ప్రజావేదిక అక్రమ నిర్మాణం.. ఎల్లుండి కూల్చేస్తాం!

Monday, June 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజావేదిక అక్రమ నిర్మాణం.. ఎల్లుండి కూల్చేస్తాం!

‘ప్రజావేదిక’ ఈ పేరు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువ సార్లు వార్తల్లో వినిపించిన పేరు. ఈ భవనాన్ని తమకు కేటాయించాలని టీడీపీ.. కుదరదని అధికార పార్టీ.. అక్రమ నిర్మాణాలేమీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు కరకట్టపై ఉండే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం అక్రమంగా నిర్మించినట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూల్చిపడేస్తామని జగన్ సర్కార్ తేల్చిచెప్పింది. అన్నట్లుగానే ఇప్పటికే ఈ ప్రజావేదికపై కమిటీ ఇచ్చిన నివేదికలో అక్రమ నిర్మాణం అని తేలింది. దీంతో ఈ నిర్మాణాన్ని కూల్చడానికి వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.

ప్రజావేదిక అక్రమ నిర్మాణం.. ఎల్లుండి కూల్చేస్తాం!

సోమవారం నాడు ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజావేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నామని.. ఇది అవినీతితో కట్టిన భవనం అని అన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చోనున్నామన్నారు. అక్రమ కట్టడాల తొలగింపును ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. "ప్రజావేదిక అన్నది అవినీతితో కట్టిన అక్రమ నిర్మాణం. రేపు పొద్దున ఈ తప్పును మరొకరు చేయకుండా మేం ఆదర్శంగా నిలుస్తాం. అందుకోసం ప్రజావేదికను ఎల్లుండి నుంచి కూలగొడతాం. ఎవరైనా సామాన్యులు ఇలాంటి బిల్డింగ్‌ను కట్టి ఉంటే ఇప్పటికే తొలగించేవాళ్లు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధగా అనిపించదా?. మన ప్రవర్తన ఎలా ఉండాలని తెలిపేందుకే ఇక్కడకు పిలిచాను. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్‌. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు కానుంది" అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఉద్దేశపూర్వకంగానే...!

"మనం కూర్చున్న ఈ బిల్డింగ్ చట్టబద్ధమయినదేనా? దీన్ని నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్దంగా, అవినీతి సొమ్ముతో కట్టారు. ఓ ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది అధికారులం ఇల్లీగల్ అని తెలిసీ సమావేశం జరుపుకుంటున్నాం. గరిష్ట వరద వస్తే ఇది మునిగిపోతుంది అని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఈ లేఖను ఇచ్చారు. అందువల్లే అనుమతిని జారీచేయలేము. అయినా టెండర్ అంచనాలను రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచి నిర్మించారు. ఇందుకోసం ఇద్దరు బిడ్డర్లు రాగా, ఒకరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారు. ఇలాంటివి ఉపేక్షించేది లేద‌ు" అని వైఎస్ హెచ్చ‌రించారు. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.