close
Choose your channels

జగన్ ప్రకటనతో చంద్రబాబుకు ముచ్చెమటలు.. ఇదే జరిగితే..!

Friday, June 14, 2019 • తెలుగు Comments

జగన్ ప్రకటనతో చంద్రబాబుకు ముచ్చెమటలు.. ఇదే జరిగితే..!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ అసెంబ్లీ సాక్షిగా ఉన్నట్టుండి జగన్ బాంబుపేల్చడంతో బాబు ముఖంలో ఏదో తెలియని పీలింగ్ వచ్చేసింది. అయితే ఇది పక్కనెడితో ఇంతకీ జగన్ అసెంబ్లీ ఏమన్నారో కాస్త క్లారిటీగా ఈ కథనంలో తెలుసుకుందాం.

మేం మార్చాలనుకుంటుంటే..!

"ఫిరాయింపులు ప్రొత్సహించే ఉద్దేశ్యం నాకు లేదు. పార్టీ మారాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరు నాతో టచ్‌లో ఉన్నారో చెప్పమంటారా..?. మేం డోర్స్ తెరిస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేయించే మా పార్టీలో చేర్చుకుంటాను. అలా జరగని పక్షంలో మీరు డిస్ క్వాలిఫై చేయొచ్చు అధ్యక్షా. ఇంత జరిగినా.. ప్రజా తీర్పు ఇలా ఉన్నా టీడీపీ తీరు మారడం లేదు. దేవుడి స్క్రిప్ట్ గూబ గుయ్ మనేలా రాసినా కుక్క తోక వంకర అన్న రీతిలోనే టీడీపీ వ్యవహరిస్తోంది. సంతలో పశువులు కొన్నట్టు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇంకా బుకాయిస్తున్నారన్నారు. హత్య చేసిన వ్యక్తి.. గతంలో హత్యలు జరగలేదా..? అని హంతకుడు ప్రశ్నించినట్టు ఉంది. చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు స్పీకర్ అనుమతిస్తే సభలో ప్రదర్శించడానికి నేను రెడీగా ఉన్నాను. సత్సంప్రదాయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంటే టీడీపీ మాత్రం తీరు మార్చుకోవడం లేదు" అని జగన్ చెప్పుకొచ్చారు.

ఎవ్వరూ పార్టీ మారరు!

అయితే.. రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన దివంగత ముఖ్యమత్రి వైఎస్సార్ ఇందిర కాంగ్రెస్ పార్టీలోకి రాజీనామా చేయకుండా వెళ్లారని గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. టీడీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు రావాలని వైసీపీ కోరుకుంటోందని అయితే మీరు అనుకుంటున్నట్లుగా ఎవ్వరూ పార్టీ మారరని గోరంట్ల జోస్యం చెప్పారు.

మళ్లీ రాజీనామా చేసి ఎన్నికలా!

ఇప్పట్నుంచే కాదు.. వైసీపీ నుంచి ఫిరాయింపులు జరిగిన తర్వాత పార్టీలోకి ఎవర్ని తీసుకున్నా కచ్చితంగా రాజీనామా చేయించే తీసుకోవాలని వైఎస్ జగన్ బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. అందుకే వైసీపీలోకి రావాలనుకున్న తెలుగు తమ్ముళ్లు జంకుతున్నారు. ఇప్పటికే కోట్లు పోసేసి ఎలాగో గెలిచాం సరే మళ్లీ రాజీనామా.. ఆ తర్వాత ఉపఎన్నికలు ఇలా చేసుకుంటూ పోతే మనకు మిగిలేదేమీ ఉండదని అనుకుని సైలెంట్‌లో టీడీపీలోనే ఉండిపోతున్నారట. అంతేకాదు.. రెండోరోజు అసెంబ్లీలో జగన్ మాట్లాడుతున్నప్పుడు.. రాజీనామా చేస్తేనే పార్టీలోకి ఎంట్రీ అని.. రాజీనామా లేకుండా అంటే తనకు చంద్రబాబుకు తేడా ఏమీ ఉండదన్న విషయం విదితమే.

ఏపీ రాజకీయాల్లో కలకలం..!

ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకం రేపుతోంది. అసలు జగన్‌తో టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? వాళ్లు వైసీపీలోకి వస్తే టీడీపీ పరిస్థితేంటి..? వైసీపీలోకి వాళ్లు వచ్చిన తర్వాత టీడీపీ పరిస్థితిని అసలు ఊహించుకోగలమా..? ఇప్పటికే చచ్చిన పాములా తయారైన టీడీపీని మళ్లీ మళ్లీ చంపాలని నిజంగానే తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz