తొలి రోజే కొత్త మంత్రులకు జగన్ షాకింగ్ న్యూస్..

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా మొత్తం 43 అంశాలపై లోతుగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పనిలో పనిగా ఇదే భేటీలోనే కొత్త మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే ఆ షాకింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఏ క్షణమైనా సరే..!

నా ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారు. ఏ మంత్రిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే తక్షణమే తొలగించేస్తాను. మంత్రి పదవికి రెండున్నరేళ్లు గ్యారెంటీ ఉండదు.. అవినీతి మరక అంటితే ఏ క్షణమైనా తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటాను. మంత్రులందరూ తమ తమ శాఖల్లో గత ఐదేళ్లలో జరిగిన తప్పులు, అవినీతి ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. అన్నింటిలో ప్రక్షాళన చేయాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉంది. మరీ ముఖ్యంగా.. జూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తిని కోరాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. జూడిషయల్‌ కమిషన్‌ ఏ శాఖల్లో కాంట్రాక్టులు, టెండర్లు..ఇలా ప్రతిది కూడా అందజేయాలని తీర్మానించాం. ఎవరైనా సరే ఈ టెండర్లు చూసుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. అన్నింటింటి పరిశీలించి తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని జూడిషియల్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచిస్తే.. ఆ సూచనలు పాటిస్తాం అని కొత్త మంత్రులకు వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.

మేం రె‘ఢీ’..!

సీఎం ఈ మాటలు అనడంతో మంత్రులు కచ్చితంగా మీకు సహకరించి ప్రజలకు ‘దటీజ్ జగన్ గవర్నమెంట్ ’ అని అనిపిస్తామని ఆ 25 మంది మాటిచ్చారట. అయితే ఈ మాటను మంత్రులు ఏ మాత్రం నిలబెట్టుకుంటారో.. వైఎస్ జగన్‌కు ఏ మాత్రం సహకరించి ఎంత మాత్రం సుపరిపాలన దిశగా అడుగులేస్తారో మరికొన్ని రోజుల వేచి చూడాల్సిందే మరి.

More News

సింగిల్ సంతకంతో వైసీపీ సీనియర్లకు జగన్ శుభవార్త!

అవును.. మీరు వింటున్నది నిజమే అతి త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘సింగిల్ సంతకం’తో శుభవార్త చెప్పబోతున్నారు.

బాలీవుడ్‌కు బ్ర‌హ్మానందం, సునీల్‌

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్స్‌గా పేరు సంపాదించుకున్న బ్ర‌హ్మానందం, సునీల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం.

రాక్ష‌సుడు.. ఆప‌రేష‌న్ హటావో

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `రాక్ష‌స‌న్‌` సినిమాను తెలుగులో `రాక్ష‌సుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ - తాప్సీ

తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ.

బాల‌య్య 105 మూవీ టైటిల్‌

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమాపై గ‌త కొన్నిరోజులుగా చాలా వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి.