మరో షాకిస్తున్న జగన్.. కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే..!!

  • IndiaGlitz, [Sunday,December 22 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనేక సంచలన నిర్ణయాలు, ఎవరూ ఊహించని రీతిలో ప్రకటనలు చేశారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలు షాక్‌కు గురవ్వగా.. కేంద్ర ప్రభుత్వం సైతం వామ్మో అంటూ ఆలోచనలో పడిందని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా స్టేట్స్‌లో అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ.. వైఎస్ జగన్ తీసుకొచ్చిన ‘ఏపీ దిశ చట్టం’. ఈ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలు పంపాలని ఇప్పటికే ఢిల్లీ, ఒడిషా ప్రభుత్వాలు ఏపీ సర్కార్‌కు లేఖలు రాశాయి. ఇక ఇవన్నీ అటుంచితే వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు.. దీన్ని సంచలన నిర్ణయం అనడం కంటే షాకింగ్ నిర్ణయం అనడం బెటరేమో.!

రేషన్‌-పెన్షన్‌కు లింకులు!

ఏపీలో రేషన్, పెన్షన్ కార్డుల విషయంలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు షాకిచ్చేలా ఉన్నట్లు కొందరు జనాలు ఆరోపిస్తున్నారు. కొత్త రేషన్, పెన్షన్ కార్డుల మంజూరు దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వీటికి, కరెంట్ బిల్లులతో లింక్‌లు పెడుతోంది. కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే.. రేషన్, 300 యూనిట్లు దాటితే పెన్షన్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఎవరి బిల్ ఎంత వస్తుందన్న విషయాన్ని గ్రామ వాలంటీర్లు ఆరా తీసి, ఉన్నతాధికారులకు చేరవేస్తుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అద్దెకిచ్చేవారికి షాకింగ్ న్యూస్!

ఇదిలా ఉంటే.. వేరే వాళ్లకు ఇళ్లను అద్దెకిచ్చే వారిపై తొలి వేటు పడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భార్యా, భర్తల ఇద్దరి పేరుతో ఉన్న ఆధార్ కార్డుకు అనుసంధానమైన అన్ని సర్వీసులు ఒక యూనిట్‌గా పరిగణించాలని అధికాలరులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, ఇల్లు అమ్ముకుని, కరెంట్ మీటర్లలో పేర్లను మార్చుకోని వారు, ఇంటిని అద్దెకిచ్చి, మరో చోట ఉంటున్న వారికి ఇబ్బందులు తప్పవని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఒకింత హెచ్చరిస్తున్నారట.

ఆ భారం యజమానిపైనే..!

ఏదైనా ఇంట్లో అద్దెకు ఉండి.. ఎక్కువ కరెంట్ ఉపయోగిస్తే, ఆ భారం ఇంటి యజమానిపై పడుతుంది. ఇక టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహా మరే ఫోర్ వీలర్ ఉన్నా కూడా వారికి రేషన్ ఇవ్వరాదని కూడా అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఉన్నతస్థాయి వర్గాల నుంచి విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా పైన చెప్పిన విషయాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ.. ఇలాంటి రూమర్స్ పెద్దఎత్తున వస్తుండటంతో జనాలు జంకుతున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

More News

మత్తువదలరా అందరికీ నచ్చుతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి

కొత్తగా దర్శకతం చేయాలనుకునే వారందరికి మత్తు వదలరా చిత్రం ఓ మంచి ఉదాహరణ. నిర్మాత నమ్మి డబ్బులు పెట్టాలంటే మీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ సినిమా దర్శకుడు రితేష్‌రానా సొంతగా టీమ్ అంతా...

'ఇద్ద‌రి లోకం ఒక‌టే' ప్రీ రిలీజ్ ఈవెంట్

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇద్దరి లోకం ఒకటే'. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా

ప్రివ్యూ చూసి మెగాస్టార్ మెచ్చుకున్నారు: డైరెక్టర్ మారుతీ

సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో

సోదాలు ఏమి జరగలేదు: సుమ

ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్లు సుమ కనకాల,  అనసూయ భరద్వాజ్ ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు GST అధికారులు.

సూర్య తదుపరి ఖరారైంది

తమిళంతో పాటు తెలుగులో మార్కెట్‌ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఈయన ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో