close
Choose your channels

మువ్వన్నెల జెండా సాక్షిగా రాజధానులపై మాట్లాడిన జగన్

Saturday, August 15, 2020 • తెలుగు Comments

మువ్వన్నెల జెండా సాక్షిగా రాజధానులపై మాట్లాడిన జగన్

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినంతగా సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల విషయమై మాట్లాడరు. ఆయన చేయాలనుకున్నవన్నీ దాదాపు సైలెంట్‌గానే చేసుకుపోతుంటారు. ఒకటి రెండు సందర్భాలు మినహా ఆయనెప్పుడూ మీడియా ఎదుట మూడు రాజధానుల గురించి మాట్లాడింది లేదు. తాజాగా నేడు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా సాక్షిగా మూడు రాజధానుల గురించి జగన్ మాట్లాడారు. నేడు విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా.. అలాంటి గాయాలు మరింకెన్నడూ తగాలకుండా జాగ్రత్త పడాలన్నా.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని పేర్కొన్నారు. దీనికి వికేంద్రీకరణే సరైన మార్గంగా భావించి మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని స్పష్టం చేశారు. త్వరలో కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానికి, విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానికి పునాదులు వేస్తామని జగన్ వెల్లడించారు. గత 14 నెలల పాలన.. రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటి అనే పదాలకు అర్థం చెబుతూ సాగిందన్నారు.

పేదరికాన్ని రూపుమాపాలన్న సంకల్పంతోనే...

పేదరికాన్ని రూపుమాపాలన్న గట్టి సంకల్పంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నామని జగన్ తెలిపారు. దీనిలో భాగంగానే.. వాహన మిత్ర, రైతు భరోసా, పింఛన్ కానుక, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యాదీవెన, చేదోడు, కాపు నేస్తం, గోరు ముద్ద, 30 లక్షల ఇళ్ల పట్టాలు, కంటి వెలుగు, చేయూత, ఆసుపత్రులలో నాడు-నేడు వంటి పథకాలన్నీ తీసుకొచ్చామని జగన్ స్పష్టం చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz