close
Choose your channels

‘పవన్.. మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?’

Monday, November 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘పవన్.. మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?’

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రవేశపెడుతున్న సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఒకటో తరగతి నుంచి 8వరకు అని నిర్ణయించిన జగన్.. ఆ తర్వాత 1 నుంచి 6 వరకే అని ప్రకటించారు. అయితే పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియం చేసేస్తే పరిస్థితి ఏంటి..? తెలుగు చచ్చిపోదా..? అంటూ రాజకీయ నేతలు, పలువురు భాషా సంఘం నేతలు, రచయితలు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ వేదిగా వైసీపీ సర్కార్‌పై వరుస ట్వీట్లు చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇంగ్లీష్ బోధనపై వస్తున్న విమర్శలపై ఇంతవరకూ ఎక్కడా స్పందించని వైఎస్ జగన్ సోమవారం నాడు.. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌‌లో అబుల్‌ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతరేకిస్తున్నవారిపై సీఎం ఎదురుదాడికి దిగారు.

పవన్‌కు స్ట్రాంగ్ కౌంటర్!
‘సినిమా నటుడు పవన్ కల్యాణ్‌కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో.. ఎంత మంది పిల్లలో మరి. నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా?.

మేం ప్రపంచ స్థాయి కోసం ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, నటుడు పవన్ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియామ్ ప్రవేశపెట్టడము ఎందుకు విమర్శ లు చేస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా..?’ అని ఈ సందర్భంగా విమర్శలకు జగన్ స్ట్రాంగ్ పంచ్‌ల వర్షం కురిపించారు.

ఎన్నో ఘటనలు నన్ను కదిలించాయ్!
‘ఒక దీపం ఇంటికి వెలుగునిస్తే.. చదువు ఆ కుటుంబంలో వెలుగునిస్తుంది

ఒక్క చదువు కారణంగానే పేదరికాన్ని తరిమికొట్టొచ్చు

కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి

చదువుకోవాలనే తపన ఉన్నా...‌చదువుకోలేని పరిస్థితి ఉంది. ఏపీలో 33శాతం మందికి చదువు అందని వారు ఉన్నారు.

నా పాదయాత్ర లో ఇటువంటి ఎన్నో ఘటనలు కదిలించాయి

పేదలు కూడా రాణించాలంటే.. ఇంగ్లీషు మీడియం చదువులు ముఖ్యం

ఇంగ్లీష్ రాకుంటే.. ప్రపంచంలో మన వాళ్లు పోటీ పడలేరు

ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజుల క్రితం జీవో ఇచ్చాం.

చంద్రబాబు, వెంకయ్య , పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయి

మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు. .?

ఇటువంటి మాటలు మాట్లాడేవారు మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో‌ చదువుతున్నారు ..?. మనం మన పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి.. మంచి చదువు
.
ఆ దిశగా అడుగులేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది

ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చాలనే నాడు..నేడు కార్యక్రమం అని చెప్పాం
’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

పవన్ చేసిన ట్వీట్స్ ఏంటి..!?
‘ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషాసంఘం ఏం చేస్తోంది. మాతృభాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేర్చుకోవాలి. తెలుగు భాష గొప్పదనం అర్థమైతే పాఠశాలల్లో నిషేధం విధించరు’ అని ఆంగ్లంలో పవన్ కల్యాణ్ ట్వీట్స్ చేశారు.

వెంకయ్యకు కౌంటర్!
అంతటితో ఆగని జగన్.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా కౌంటరిచ్చారు. వెంకయ్య పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? అని ఈ సందర్భంగా సూటి ప్రశ్న సంధించారు. దేశంలో ప్రతి చోటా అమ్మభాషలోనే విద్యా బోధన జరగాలని.. మాతృభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య హెచ్చరించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై వెంకయ్య, జనసేనాని పవన్.. ఆ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.