close
Choose your channels

విదేశాల నుంచి వచ్చినవారికి జగన్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

Monday, March 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విదేశాల నుంచి వచ్చినవారికి జగన్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య కార్యదర్శి ఓ కీలక ప్రకటన చేశారు. ‘ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధం పాటించేలా చూసేందుకు.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. కొందరు ప్రభుత్వ సూచనలు పాటించకుండా బయట తిరుగుతున్నట్లు సమాచారం అందింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించాం’ అని జవహర్ ప్రకటించారు.

అధిక ధరలకు అమ్మారో..!
‘కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలి. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్‌తో సమీక్ష చేశాం. ఎవరైనా మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. వాటిని ఎమ్మార్పీ ధరలకు అమ్మినా చర్యలు తీసుకుంటాం. కొన్న ధర కంటే 10 శాతానికి మించి అధికంగా తీసుకోకూడదు. అలాగే ప్రతి మెడికల్ షాప్‌లో ధరలను డిస్‌ప్లే చెయ్యాలి. కరోనా నిర్ధారణ ల్యాబ్‌లను తిరుపతి, విజయవాడలో ఏర్పాటు చేశాం. మంగళవారం కాకినాడలో మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని జవహర్ తెలిపారు.

కరోనా లక్షణాలున్న మహిళ మ‌ృతి
ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతి చెండం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని అంతర్వేదిపాలెంకు చెందిన ఆ మహిళ ఇటీవలే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చింది. ఆమెకు జలుబు, తీవ్ర జ్వరంతో ఉండటంతో కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కరోనా అనుమానంతో ఆ మహిళను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా.. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం మృతి చెందింది. అయితే.. ఆమెకు కరోనా వైద్యపరీక్షల చేసి ల్యాబ్‌కు పంపగా.. ఇంకా నివేదిక రాలేదు. కాగా.. హైదరాబాద్‌లోనూ ఓ వ్యక్తి ఇలాగా వైద్య పరీక్షల రిపోర్టులు రాకమునుపే మృతి చెందిన విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.