close
Choose your channels

రోజా స‌మ‌ర్ప‌ణ‌లో పురాణ పండ శ్రీనివాస్ ర‌చించిన 'శ్రీపూర్ణిమ‌' గ్రంథంను త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్

Monday, July 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాధ‌కుల‌కు అవ‌స‌ర‌మైన ప‌వ‌న దివ్య‌త‌త్వాల్ని, ప‌ర‌మ త‌త్వాల్ని త‌న్మ‌య భావంతో అందించడంలో అందవేసిన చెయ్యిగా తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నూతనంగా అందించిన పవిత్ర వైభవ మహాగ్రంథం `శ్రీపూర్ణిమ`. సుమారు 800 పేజీలతో పరమాత్మ లాలిత్యాన్ని అనేక స్తోత్రాలతో, అనేక లలిత లలిత పదబంధురాల వ్యాఖ్యానాలతో దర్శనమిస్తున్న ఈ `శ్రీపూర్ణిమ‌` మ‌హాగ్రంథానికి ర‌చ‌నా సంక‌ల‌నక‌ర్త శ్రీశైల‌దేవ‌స్థానం పూర్వ ప్రత్యేక స‌ల‌హాదారులు పురాణ‌పండ శ్రీనివాస్ కాగా.. ఈ మ‌హాగ్రంథ లావ‌ణ్యాన్ని సుప్ర‌సిద్ధ న‌టి, న‌గ‌రి శాస‌న‌స‌భ్యురాలు జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేమ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ శ్రీమ‌తి రోజా భ‌క్తితాత్ప‌ర్యాల‌తో మ‌న‌కు స‌మ‌ర్పించ‌డం విశేషం.

ఎక్క‌డున్నా నిత్యం ఉద‌య సాయంకాలాల‌లో త‌న ఇష్ట‌దైవ‌మైన తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రునికి ప్రార్థ‌న‌లు స‌మ‌ర్పించే రోజా ఇంత‌టి మ‌హోజ్వ‌ల వైభ‌వ గ్రంథానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆస‌క్తిదాయంగానే చెప్పాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌లో రాష్ట్రం క్షేమ‌దాయ‌కంగా ఉండాల‌ని, ప్ర‌జ‌లంతా సుఖ‌శాంతుల‌తో వ‌ర్ధిల్లాల‌ని కోరుకుంటూ తాను ఈ మంగ‌ళ కార్యాన్ని అందిస్తున్న‌ట్లు `శ్రీపూర్ణిమ‌` అట్ట వెనుక భాగంలో ప్ర‌క‌టించ‌డం రోజాకి జ‌గ‌న్నోహ‌న్ రెడ్డి ప‌ట్ల ఉండే గౌర‌వాన్ని ప్ర‌జా సంక్షేమం ప‌ట్ల ఉండే శ్ర‌ద్ధ‌ను తెలియ‌జేస్తోంది.

భార‌త వైదిక వాజ్మ‌యంలో ఉండే ప్ర‌ధాన అంశాల‌న్నింటినీ ఈ `శ్రీపూర్ణిమ‌`లో ఓ అద్భుత సార‌స్వ‌త దృష్టితో భ‌క్తుల‌కు ఎంతో స‌న్నిహితంగా ఉండేలా పురాణ‌పండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని నిస్వార్థ ప‌ర‌మార్థ చింత‌న‌తో ప్ర‌చురించ‌డం వేల‌కొల‌ది భ‌క్తుల్ని ఆక‌ర్షించే అంశం.

స‌క‌ల దేవ‌తా సంద‌ర్శ‌నం ఈ అపురూప గ్రంథ‌మ‌ని చెప్పాలి. ప్రార్థ‌న‌కు పారాయ‌ణ‌కు ఉపయోగించే శ్రీరాగ రంజిత‌మైన అనేక మ‌హాగానాలు అక్ష‌ర ర‌మ్య‌త‌తో పాఠ‌కుడికి ఎంతో లావ‌ణ్య భ‌రితంగా ద‌ర్శ‌న‌మిస్తాయి. శ్రీ మ‌హాస‌రస్వ‌తి అవ్యాజ‌, అద్భుత‌, అపార‌, అపూర్వ అనుగ్ర‌హం వ‌ల్ల‌నే రోజా ఈ గ్రంథానికి స‌మ‌ర్ప‌కురుఆలుగా బాధ్య‌త‌ను మోయ‌గ‌లిగింద‌నేది ప్ర‌స్ఫుటమ‌య్యే స‌త్యం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.