కాళేశ్వరంకు జగన్ రాక సరే.. కట్టప్ప సంగతేంటి!?

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. టీఆర్ఎస్ సర్కార్ అనడం కంటే.. నాటి మంత్రి తన్నీరు హరీష్ రావు మనసుపెట్టి నిద్రాహారాలు మాని అహర్నిశలు కష్టపడి.. దగ్గరుండి చేపించిన ప్రాజెక్టు అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో. అయితే తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత.. కల్వకుంట్ల కుటుంబానికి అన్నీ తానై కట్టప్పలా కాపలా కాస్తూ.. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. 2014 ఎన్నికల తర్వాత హరీశ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. 2018 తర్వాత ఎందుకివ్వలేదో.. కేసీఆర్ మనసులో ఏముందో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.

శిలాపలకాలపై పేర్లు..!

ఇక అసలు విషయానికొస్తే.. ఈ నెల 21న తెలంగాణ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాల‌ని సీఎం కేసీఆర్ స్వయంగా అమ‌రావ‌తికి వెళ్లి సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా ఆహ్వానం అందింది. వీరిద్దరి రాకకు గుర్తుగా వారికి గౌర‌వం ఇస్తూ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలా ఫ‌ల‌కంపై ఆ ఇద్దరి సీఎంల పేర్లు చెక్కించాలని టీఆర్ఎస్ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారని టాక్. అయితే జగన్‌కు ఈ అపూర్వ ఘట్టం ఎప్పటికీ తీపి గుర్తుగా నిలిచిపోనుందని చెప్పుకోవచ్చు.

పిలవకపోతే ఇంతకంటే..!

అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత తొందరగా పూర్తి అయ్యి రేపొద్దున్న ప్రారంభానికి సిద్ధమవుతోందన్నా ఇందుకు కర్త, కర్మ, క్రియ హరీష్ రావని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైఎస్ జగన్‌తో పాటు కావాల్సిన ముఖ్యులను అందర్నీ పిలిచిన కేసీఆర్.. అసలు హరీష్‌ను పిలిచారా..? లేదా అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు, తన్నీరు అభిమానుల్లో సందేహాలు మొదలవుతున్నాయి. కాగా.. హరీష్ పేరు లేకున్నా.. హరీష్‌ను ఈ కార్యక్రమానికి పిలవకున్నా కేసీఆర్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే అవుతుందని కొందరు ఆయన వీరాభిమానులు అనుకుంటున్నారట. సో.. ఒక వేళ పిలుపు వచ్చిందంటే హరీష్ వెళ్తారా..? లేకుంటే లైట్ తీసుకుంటారా..? అనేది తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

చార్లీచాప్లిన్‌గా మారిన శివాజీ

ఇదేంటి.. గరుడుపురాణం శివాజీ.. చార్లీచాప్లిన్‌లా మారడమేంటి..? తూచ్.. ఆయనకు ఏం అవసరం..?

మంత్రి వార్నింగ్.. గంటల్లోనే టీటీడీ చైర్మన్ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే.

ఫొటో తెచ్చిన తంటా.. జగన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్.. ఫైనల్‌గా..!

రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలయ్య

దాసరి కొడుకు ప్రభు అచూకి లభ్యం...

ఆరు రోజుల క్రితం మిస్సయిన దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు ఆచూకీ లభ్యమైంది.

సీమ రెడ్లంతా టీడీపీకి టాటా చెప్పబోతున్నారా.. వాట్ నెక్ట్స్‌!?

రాయలసీమలోని టీడీపీకి చెందిన రెడ్లంతా పార్టీకి టాటా చెప్పేసేందుకు సిద్ధమవుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు బీజేపీలోకి కొందరు..