మద్యం నియంత్రణపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం

  • IndiaGlitz, [Thursday,November 07 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మద్యం నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో అడుగు ముందుకేశారు. బార్ల సంఖ్యలను తగ్గించాలంటూ సంబంధిత అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందుల్లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని జగన్ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి పదింటి వరకే బార్లలో మద్యం అమ్మాలని ఆదేశించారు. విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. గురువారం నాడు ఆదాయశాఖలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జగన్ పై నిర్ణయం తీసుకున్నారు. శాఖలవారీగా వస్తున్న ఆదాయాన్ని సీఎంకు అధికారులు వివరించారు.

ప్రభుత్వం గతంలోనే దశలవారీగా మద్యపాన నిషేధం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. నిషేధంలో భాగంగా ముందుగా బెల్టు షాపులను చెక్ పెట్టేస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాపుల నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 880 షాపులకు కోత విధించింది. 3,500 మద్యం దుకాణాలు నిర్వహించనుంది.