అ,ఆలు కూడా రాని లోకేశ్‌‌కు అగ్రతాంబూలమా!? 

  • IndiaGlitz, [Monday,March 25 2019]

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన షర్మిల లోకేశ్‌ గురించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది.? చంద్రబాబు సుపుత్రుడు లోకేష్‌కు వచ్చింది. ఏకంగా మూడు మంత్రి శాఖలను అప్పగించారు.

జయంతి- వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. అ ఆలు కూడా రావుకాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట ఒకడు.. అనే చందాన ఒక ఎన్నికల్లో కూడా గెలవలేదు. ఏ అర్హత, అనుభవం ఉందని,ఒకటి,రెండు కాదు మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్స్యలం కాదా..? చంద్రబాబు కొడుకుకు మూడు ఉద్యోగాలు ఇవ్వొచ్చు. సామాన్య ప్రజలకు ఉద్యోగాలులేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా..స్వార్థం కాదా..ఒక సామాన్యరాలిగా అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌కు ఐటి శాఖ ఇచ్చారని, చంద్రబాబు ఆయన కొడుక్కి ఇచ్చారు అని లోకేశ్‌పై షర్మిళ సెటైర్ల వర్షం కురిపించారు.

దొంగతనం.. హోదా వద్దన్నదెవరు?
కేటీఆర్ లాగా ఈయన కూడా గొప్ప గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా.? అని చూస్తే.. వీళ్లు గొప్పగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వస్తుందని ప్రచారం చేసిన 12 గంటల లోపు మాకు ఆ ఉద్దేశం లేదని వారు ప్రకటించారు. కేవలం ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ఆధార్, ఓటర్, బ్యాంక్‌ వివరాలు లోకేష్‌ దొంగతనం చేసి తనకు కావాల్సిన ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చుకున్నాడు. ఏ కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉన్నారు. ఏ అక్కౌంట్‌లో ఎంత డబ్బు ఉన్నది అనేది బయటపడింది. దీనికి కారణం ఏవరో చంద్రబాబుకు తెలియదా..?.

ఇప్పటికైనా ఆ డేటాను స్వాధీనం చేసుకుని దోషులను శిక్షించాస్తారని అనుకుంటే.. అలా చేయకపోతే వారికి మేమే ఆశ్రయం కల్పిస్తున్నామని ప్రకటించారంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు సిగ్గు అనిపించలేదా..? బాబు, మోదీ జోడి కలిసి ఆంధ్రకు రావాల్సిన ప్రత్యేకహోదాను ఎగ్గొటారు. బీజేపీ మన చెవుల్లో పూవ్వులు పెట్టి మనకు ద్రోహం చేసిందంటే దానికి కారణం చంద్రబాబు కాదా.. హోదా వద్దు ఫ్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం పెట్టలేదా..?

హోదా కోసం పోరాడతామంటే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించలేదా..?హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు హేళన చేయలేదా..? ప్రతిపక్షనేత జగన్‌ హోదా కోసం పోరాటంలో భాగంగా విశాఖ పట్నం వెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో నిర్భదించలేదా.? వైసీపీ నాయకులు హోదాకోసం అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు వారిని అరెస్ట్‌ చేయించి ఉద్యమాన్ని అణించివేసే చర్యలు చేయలేదా.? ఆంధ్ర రాష్ట్రానికి కీలకమైన ప్రత్యేకహోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోడా..? అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More News

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌గా...

హీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ప్రొడ‌క్ష‌న్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ను స్టార్ట్ చేశాడు.

ఐశ్వ‌ర్య గ‌ర్భ‌వ‌తి కాదు!

అందాల రాశి ఐశ్వ‌ర్య గ‌ర్భం దాల్చారా?  ఆమె మ‌రో సారి త‌ల్లి కాబోతున్నారా? అవున‌ని ఫొటోలు చెబుతుంటే, కాద‌ని ఆమె మీడియా టీమ్ చెబుతోంది.

వైసీపీ రూపంలో కేసీఆర్.. టీడీపీకి భయం

వైసీపీ రూపంలో కేసీఆర్ ఉన్నారని.. వైసీపీని చూస్తే టీడీపీకి భయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

జ‌న‌సేన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల తుది జాబితాను ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు. మూడు లోక్ స‌భ,

మంగళగిరి నుంచే రాజకీయాలు చేస్తా: పవన్

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తే.. తాను అక్కడ్నుంచే బరిలోకి దిగుతానని ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అ