close
Choose your channels

నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్‌.. సేమ్ సీన్!!

Thursday, January 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్‌.. సేమ్ సీన్!!

ఇదేంటి.. టైటిల్ చూడగానే దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారకరామారావుకు.. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పోలికేంటబ్బా..? అని ఆశ్చర్యపోతున్నారా..? పోలికేం కాదండోయ్ బాబూ.. నాడు ఎన్టీఆర్ హయాంలో నేడు వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఘటనలు మాత్రమే పోలిక అంతే. అసలు అప్పుడేం జరిగింది..? అప్పట్లో ఎన్టీఆర్ ఏం చేశారు..? నేడు వైఎస్ జగన్ ఎందుకు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు..? జగన్ ఎలా ముందడులు వేయబోతున్నారు..? అనే విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అప్పుడు అన్నగారికి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్నగారు ఎన్టీఆర్ మంచి మెజార్టీతో సీఎం అయ్యారు. శాసన సభలో టీడీపీకి బలం ఉంది కానీ.. శాసన మండలిలో మాత్రం పెద్దగా సీట్లు లేకపోవడంతో.. బిల్లులు పాస్ చేయించుకోవాలన్న ప్రతిసారి ఎన్టీఆర్ నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది దీంతో చిరాకు పుట్టడంతో 1985 సమయంలోనే మండలిని రద్దు చేయడం జరిగింది. అయితే.. సేమ్ టూ సేమ్ అదే పరిస్థితి నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఏర్పడుతోంది. 2019 ఎన్నికల్లో కనివినీ ఎరుగని.. ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ అధినేత కైవసం చేసుకున్నారు. అయితే అసెంబ్లీలో మాత్రం జగన్ చెప్పినా చెల్లుతోంది కానీ.. మండలిలో మాత్రం అస్సలు జగన్ మాట ఏ మాత్రం జరగట్లేదు. ఇందుకు ఉదాహరణ జగన్ తీసుకున్న మూడు రాజధానులు, విద్యా చట్టంలోని సవరణలు, సీఆర్డీఏ రద్దు బిల్లులే కారణం.

ఇప్పుడు జగన్‌కు..!
అప్పట్లో ఎన్టీఆర్‌ను నాటి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ముప్పు తిప్పలు పెట్టారని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా.. ఈ తరుణంలో చేసేదేమీ లేక అన్నగారు.. మండలిని రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. రద్దు చేసి చూపించారు కూడా. అలా 1985లో రద్దయిన శాసన మండలి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి ఆ పరిస్థితులు తీసుకొచ్చారు. నాటి నుంచి ఇప్పటి వరకూ రద్దు అనే వ్యవహారం దాకా పోలేదు. అయితే ప్రస్తుతం మండలిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఎదరువుతుండటం.. మండలి చైర్మన్ ఏ మాత్రం సహకరిచకపోవడంతో జగన్ కూడా నాటి ఎన్టీఆర్ నిర్ణయాన్నే అమలు చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండ్రోజుల్లో మండలి రద్దు కావొచ్చని తెలుస్తోంది.

మండలి అవసరమా..!?
రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న జగన్.. విడిపోయిన, ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా? అని అసెంబ్లీ వేదికగా ఆయన సభ్యులను ప్రశ్నించారు. ‘మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారు. డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు అసెంబ్లీలో ఉన్నారు.. ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారు. ఇంత మంది విజ్ఞులు అసెంబ్లీలోనే ఉంటే.. మండలి అవసరమేముంది..? మండలి కోసం ఏడాదికి రూ.60కోట్లు ఖర్చు చేస్తున్నాం. మండలి అనేది సలహాలు, సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి. మండలి బిల్లులు చట్టం కాకుండా నిరోధించే సభగా మారింది. హత్య చేయడం తప్పు.. అయినా నేను చేస్తా అన్నట్టుగా మండలి తీరు ఉంది. ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాను. దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది’ అని అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మొత్తానికి చూస్తే జగన్ తన మనసులోని మాటను పరోక్షంగా అసెంబ్లీ వేదికగా చెప్పేశారు. మరి శాసనమండలి రద్దు ఎప్పుడు ఉంటుందో ఏంటో..!. ఒక వేళ జగన్ ఇదే నిర్ణయం తీసుకుంటే పరిస్థితేంటి..? ఎలా ముందుకెళ్లాలనేదానిపై టీడీపీ, బీజేపీ నేతలు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్‌గా జగన్ ఏం తేలుస్తారో..? అనేది తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.