వైసీపీ ఫీజు పోరు.. టీడీపీ ఎదురుదాడి


Send us your feedback to audioarticles@vaarta.com


'ఫీజు పోరు' పేరిట నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పోస్టర్ రిలీజ్ చేశారు. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు.
వైసీపీ ఆరోపణల్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. గతంలో విద్యార్ధుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసిందని... కానీ జగన్ మాత్రం ప్రచార ఆర్భాటం కోసం విద్యా దీవెన అంటూ విద్యార్ధుల్ని, వారి తల్లితండ్రుల్ని మోసం చేశారని ఆరోపించారు ఏలూరు జిల్లా తెలుగుదేశం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్.
"పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వాగుతున్న జోగి మాటలకు అర్ధం ప్రజలు బిచ్చగాళ్లు అనేనా? ప్రజలను బిచ్చగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదు. దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడారు. బకాయిల కుప్ప పెట్టి పోయారు. 2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ పాలనలో కేవలం 9 లక్షల మందికి అది కూడా విడతల వారీగా ఇచ్చి, మిగిలిన 7 లక్షల మంది పేద విద్యార్ధులను మోసగించారు. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు."
ఓవైపు ఇలా టీడీపీ నుంచి మాటల దాడి కొనసాగుతుండగా, మరోవైపు వైసీపీ తన ఫీజు పోరు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉంది. దీంతో వైసీపీ తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఫిబ్రవరి 5న కాకుండా, మార్చి 12వ తేదీన ఫీజు పోరు చేపడతామని తెలిపింది.
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడానికి చేతులురాని జగన్ కు అధికారం ఊడిపోయాక మేము గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తోంది విద్యార్థి లోకం. జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టడంతో తమ తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కట్టారని... తాము కష్టపడి చదివి పాసైనా… pic.twitter.com/Pgx1RIqIpx
— Telugu Desam Party (@JaiTDP) February 3, 2025
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com