Adimoolam: నారా లోకేష్‌తో సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ

  • IndiaGlitz, [Tuesday,January 30 2024]

ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్త రాగాలు ఎక్కువతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోకి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సమావేశం అయ్యారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గ మార్పులు చేర్పులు చేస్తున్న సీఎం జగన్.. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని ప్రకటించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలంను నియమించారు.

అయితే తిరుపతి ఎంపీగా పోటీ చేయడానికి సుమఖంగా లేని ఆదిమూలం అధిష్టానంపై తీవ్ర విమర్శలకు దిగారు. తనకు టికెట్ దక్కకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. సత్యవేడులో తన ప్రమేయం లేకుండా పెద్దిరెడ్డి కుటుంబం వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుకను దోచుకుంటూ కోట్ల రూపాయలు సంపాందించారంటూ ఆరోపణలు చేశారు.

తిరుపతి లోక్‌సభ స్థానానికి మార్చి తనను మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు పార్టీలో గౌరవం లేదని.. కేవలం దళిత సీట్లనే మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అన్యాయం చేయగలరా? అని ప్రశ్నించారు. దీంతో ఆదిమూలం వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తల నేపథ్యంలో లోకేష్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వుడు స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే మూడు స్థానాల్లోనూ అభ్యర్థుల్ని మార్చారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా.. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రెడ్డప్పకు గంగాధర నెల్లూరుకు మార్చారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఎంఎస్ బాబుకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన కూడా విమర్శలు గుప్పించారు. దళితులంటే వైసీపీకి చిన్న చూపని మండిపడ్డారు. జిల్లాలో రెడ్లదే రాజ్యం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

Pushpa 2:పుష్ప2 నుంచి చీరలో బన్నీ గెటప్ లీక్.. దర్శకుడు సుకుమార్ సీరియస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Prof Kodandaram: తెలంగాణ హైకోర్టులో ప్రొఫెసర్ కోదండరామ్‌కు షాక్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం

Ayyannapatrudu: సీఎం జగన్ నుంచి షర్మిలకు ప్రాణహాని ఉంది: అయ్యన్నపాత్రుడు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. "సీఎం జగన్ చాలా దుర్మార్గుడు.

Prime Minister Modi:ప్రధాని మోదీ భారీ స్కెచ్.. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి పేరు కొంతకాలంగా మార్మోగుతూనే ఉంది. ఇటీవల దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అవార్డు దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖల

Hanuman:KGF రికార్డ్ దాటేసిన 'హనుమాన్'.. టాప్-10 సినిమాల్లో చోటు..

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.