కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం, మృతులు వైసీపీ ఎమ్మెల్యే బంధువులు

  • IndiaGlitz, [Wednesday,January 12 2022]

గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తల్లికూతుళ్లు కాలువలో గల్లంతయ్యారు. వీరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడి భార్యాపిల్లలు. దుర్గి మండలం అడిగొప్పుల వద్ద ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అదుపుతప్పి సాగర్‌ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు ప్రాణాలతో బయటపడగా.. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో బట్టల కోసం పిన్నెల్లి సోదరుడు మదన్‌మోహనరెడ్డి భార్య లావణ్య , కుమార్తె సుదీక్షతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అడిగొప్పల దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవింగ్ చేస్తున్న మదన్‌మోహనరెడ్డి ఈదుకుంటూ బయటకు రాగలిగారు. అయితే నీటి ప్రవాహా ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కారు కోసం రాత్రి నుంచి గాలిస్తున్నారు.

వీరి కారు సాగర్‌ కాలువలో పడిందనే సమాచారం అధికారులకు తెలపడంతో బుగ్గవాగు రిజర్వాయర్‌ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా నిలిపేశారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో భారీ క్రేన్‌‌ను పిలిపించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కారును కాలువ నుంచి బయటికి తీయగా... లావణ్య, చిన్నారి సుదీక్ష మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మదన్‌మోహన్ రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రంతా సంఘటనా స్థలంలో ఉండి రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More News

అసలే చలితో గజగజ... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, అక్కడక్కడా వడగండ్ల వానలు

అసలే చలితో వణుకుతుంటే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు వార్త చెప్పింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని..

కృష్ణా జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా, మున్నేరులో మునిగి ఐదుగురు బాలురు మృతి

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరులో ఐదుగురు విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్ బారినపడ్డ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. ఐసీయూలో చికిత్స

దేశంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వరుస పెట్టి ఒక్కొక్క సినీ ప్రముఖుడు పాజిటివ్‌గా తేలుతున్నారు.

మంత్రి హరీశ్‌రావును కలిసిన బాలకృష్ణ.. క్యాన్సర్ హాస్పిటల్‌కు సాయంపై వినతి

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుని కలిశారు.

అదిరిపోయిన మహేష్ మేనల్లుడి 'హీరో' ట్రైలర్ .. అశోక్ గల్లా లుక్స్ అదుర్స్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి.