close
Choose your channels

Nandamuri Taraka Ratna : తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థ్యాంక్స్

Wednesday, February 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి విషమంగానే వుందని వైద్యులు తెలిపారు. అయితే ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తూ వుండటం ఊరటనిచ్చే పరిణామం. గత రెండు రోజులుగా తారకరత్నను పరామర్శించిన వైద్యులు ఇదే మాటను చెబుతున్నారు. అటు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నను పరామర్శిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం ఆయనను పరామర్శించి , తారకరత్న ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం తారకరత్న మెదడుకు చికిత్స :

అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా వుందన్నారు. ప్రస్తుతం ఆయన గుండె, కాలేయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు బాగున్నాయని, మెదడులో వాపు ఏర్పడటంతో ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స జరుగుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తారకరత్న గుండెపోటుకు గురైన రోజున 45 నిమిషాల పాటు రక్తప్రసరణ ఆగిపోయిందని.. దీంతో మెదడులో నీరు చేరిందని ఆయన తెలిపారు. రెండ్రోజుల్లో తారకరత్న ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే అవకాశం వుందని.. డాక్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు. అలాగే తారకరత్న చికిత్స, ఇతర విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నందమూరి బాలకృష్ణకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

తారకరత్న-అలేఖ్యల పెళ్లి జరిపించిన విజయసాయిరెడ్డి:

ఇకపోతే.. తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. విజయసాయిరెడ్డి సతీమణి సునంద చెల్లెలి కుమార్తె. ఈ క్రమంలో విజయసాయికి తారకరత్న వరుసకి అల్లుడు అవుతారు. అంతేకాదు.. తారకరత్న- అలేఖ్యల ప్రేమ పెళ్లికి ఆయన గట్టి మద్ధతు పలికి, దగ్గరుండి వివాహం జరిపించారట. ఈ విషయాన్ని అలేఖ్య పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.