తిరుమల కొండపై వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్

  • IndiaGlitz, [Saturday,January 12 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌ రెడ్డి పాదయాత్ర ముగించుకుని కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు కదిలారు. ఈ క్రమంలో పలువురు వైఎస్ అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరు కార్యకర్తలు శ్రీవారి ఆలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో తిరుమల కొండపై గందరగోళం నెలకొంది. కాగా ఎలాంటి టోకెన్స్ లేకుండానే క్యూ కాంప్లెక్స్‌‌లో ప్రవేశించడానికి యత్నించడం గమనార్హం. వైసీపీ కార్యకర్తల వ్యవహారంపై వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఎలా ఉండాలో తెలియకపోతే ఎలా అని వైసీపీ కార్యకర్తలతో.. కొందరు భక్తులు వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది.

కాలినడకన వెళ్లేటప్పుడు ఇబ్బందులే..!
పాదయాత్ర ముగించుకుని తిరుమలకు చేరుకున్న వైఎస్‌‌ జగన్‌‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. అనంతరం జగన్ కాలినడకన మూడు గంటల్లో కొండపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు పలుచోట్ల జై జగన్.. సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అదే కాలినడకన తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందిపడ్డారు. అల్లర్లు చేయకుండా వెళ్లాలని కార్యకర్తలతో ఓ వైపు వైసీపీ నాయకులు, మరోవైపు టీటీడీ సిబ్బంది వారించారు. దీంతో గందరగోళం తగ్గింది.

శుక్రవారం కడపకు జగన్..
పాదయాత్ర కడప నుంచి ప్రారంభించిన జగన్ 424 రోజులు ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని సొంత జిల్లాకు రానున్నారు. మూడు రోజులపాటు జిల్లాలోనే ఉంటారని సమాచారం. కాగా ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థులపై జగన్ ఆరాతీయనున్నారు. అయితే ఇప్పటికే సొంత జిల్లాలో కూడా పీకే సర్వేతో పాటు సొంతంగా కూడా సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వే వ్యవహారంపై కూడా కడప జిల్లా నేతలతో జగన్ చర్చించే అవకాశముంది. కాగా ఓ వైపు టీడీపీ.. మరోవైపు జనసేన కూడా కడప జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జగన్ ఆచితూచి అడుగులేస్తున్నారు.

More News

అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిపోయినట్లేనా!

టాలీవుడ్ నటుడు అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయ్యిందా..? ఇటీవల ఓ మంత్రితో జరిగిన భేటీలో టికెట్ వ్యవహారం తేలిపోయిందా..?

ఈ నేతలందరికీ పవన్ టికెట్లిస్తారా..!?

యువతను ఆదరిస్తా..! యూత్ రాజకీయాల్లోకి రావాలి..! యువకులకు టికెట్లిచ్చి ప్రోత్సహిస్తా.. 60 శాతం యువకులకే టికెట్లు ఇస్తానంటున్న జనసేనాని అధినేత పవన్ కల్యాణ్.

అస‌లేం జ‌రిగింది? చిత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్ 

ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది? చిత్రం పోస్ట‌ర్‌ను ఎంపీ సంతోష్ కుమార్  శ‌నివారం  జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో ఆవిష్క‌రించారు.

ఈ భారీ ప్లాన్స్‌తోనే చంద్రబాబు మళ్లీ గెలుస్తారా!

ఆంధ్రప్రదేశ్‌‌కు మరోసారి సీఎం అవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేస్తున్నారు.!

జనసేనలో చేరికపై భూమా అఖిల స్పందన

తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు చేస్తున్న భూమా కుటుంబం త్వరలోనే జనసేనలో చేరుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.