close
Choose your channels

సీఎం జగన్‌కు చంద్రబాబు రెక్వెస్ట్.. వైసీపీ నుంచి ఊహించని షాక్!

Thursday, June 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఎం జగన్‌కు చంద్రబాబు రెక్వెస్ట్.. వైసీపీ నుంచి ఊహించని షాక్!

కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా.. తన ఇంటికి సమీపంలోనే ఉండటం.. పార్టీ అధినేతగా తనను కలిసేందుకు వచ్చిన వారు భేటీకి అనుకూలంగా ఉండటంతో ఆ భవనాన్ని తమకు ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను చంద్రబాబు కోరారు. అయితే ఈ విషయంపై వైఎస్ జగన్ ఇంతవరకూ రియాక్ట్ కాలేదు కానీ.. వైసీపీ మాత్రం ఊహించని షాకిచ్చింది.

ఈ లేఖ వ్యవహారంపై.. వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంకు లేఖ రాశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజావేదిక అనువుగా ఉంటుందని.. ఇది టీడీపీ ఇచ్చే ప్రసక్తే లేదని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రజావేదికలో వైసీపీ నిర్వహించే సమావేశాలకు పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్ హాజరవుతారని రఘురాం స్పష్టం చేశారు. సీఎం భద్రతతోపాటు, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రజావేదిక అనువుగా ఉంటుందని వైసీపీ అభిప్రాయపడుతోంది. మరోవైపు.. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజావేదికను వైసీపీకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో రఘురాం పేర్కొన్నారు.

అక్రమ కట్టడం అని తేలితే..!

ప్రజావేదిక అక్రమ కట్టడమని అధికారులు నిర్ధారిస్తే.. తక్షణమే ఖాళీ చేసి ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని రఘురాం స్పష్టం చేశారు. అధికార పార్టీ వినతి పట్ల సీఎస్ సానుకూలంగా స్పందిస్తే.. ఇక నుంచి బాబు నివాసం పక్కనే వైఎస్ఆర్సీపీ అధినేత హోదాలో సీఎం జగన్ తన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తారన్నమాట. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వస్తుంది..? ఒకే భవనం కోసం అటు టీడీపీ.. ఇటు వైసీపీ పోటాపోటీగా ఉంది.. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.