జూలై 31న 'యుద్ధం శరణం' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'యుద్ధం శ‌ర‌ణం'. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టీజ‌ర్‌ణు జూలై 31సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా...

వారాహి చ‌ల‌న చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ''విల‌క్ష‌ణ‌మైన హీరోయిజంతో ఉన్న సినిమాల‌ను చేయ‌డంలో ఆస‌క్తి చూపే అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన పుల్‌ లెంగ్త్ ఫ్యామిలీ యాక్ష‌న్‌ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం'. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్ లుక్స్ చాలా సూప‌ర్బ్ అంటూ ప్రేక్ష‌కుల నుండి స్పంద‌న వ‌చ్చింది. సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. క‌థ‌కు త‌గ్గ టైటిల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రావు రమేష్‌లు కీలకపాత్రల్లోఒ న‌టిస్తున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను జూలై 31 సాయంత్రం 5.45 గంట‌ల‌కు విడుద‌ల చేస్తాం. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో అక్కినేని అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి సినిమాను వీలైనంత త్వర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

More News

నాన్న, అక్కతో సినిమా చేస్తాను - అక్షర

కమల్ తనయలు శ్రుతిహాసన్,అక్షర హాసన్ ఇద్దరూ సినీ రంగంలోనే రాణిస్తున్నారు.

రొమేనియాలో 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్'.ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

చిరు టైటిల్ తో తేజ్

మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మారుతి ప్రస్తుతం శర్వానంద్తో `మహానుభావుడు` సినిమాను రూపొందిస్తున్నాడు. దీని తర్వాత సాయిధరమ్ తేజ్తో మారుతి సినిమా చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడట.

'వివేకం' రికార్డ్

తమిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో వరుసగా చేస్తున్న నాలుగో సినిమా `వివేకం`.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'సువర్ణ సుందరి'

హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలకు ప్రస్తుతం ఆదరణ బాగా వుంటున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు