close
Choose your channels

రాగద్వేషాలలో చిక్కుకున్న రెండు జంటల కథ 'అగ్నిపరీక్ష'

Tuesday, October 12, 2021 • తెలుగు Comments

Press Release

రెండు జంటల మధ్య మంట రేపిన ప్రేమ… పగను మరియు మనసులలో దాగున్న ద్వేషాన్ని తొలిగించగల్గుతుందా? తెలుసుకోవాలంటే 'అగ్నిపరీక్ష' అనే సరికొత్త ధారావాహిక చూడాల్సిందే. తనూజ పుట్టస్వామి, ఆకర్ష్ బైరాముడి, మాహి గౌతమి, నవీన్ వెట్రి మరియు ప్రభాకర్ ప్రధాన పాత్రధారులుగా ఈ అక్టోబర్ 18 నుండి రాత్రి 9:30 గంటలకు మీ ముందుకు వస్తుంది మన జీ తెలుగు లో.

కథ విషయానికి వస్తే, రాధిక (తనూజ పుట్టస్వామి), ప్రియాంక (మాహి గౌతమి) ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వారి తండ్రి (ప్రభాకర్) ప్రేమ వివాహాలకు విరుద్ధం. కానీ, కుటుంబానికి తెలియకుండా రాధిక తన చిరకాల మిత్రుడు అయినా అమర్ (ఆకర్ష్ బైరాముడి) ని ప్రేమిస్తుంది. అమర్ కూడా రాధికను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. విధి ఆడే వింత ఆట వల్ల రాధికా మరియు అమర్ మధ్యలో ప్రవేశిస్తాడు కైలాష్ (నవీన్ వెంట్రి). మరి తన రాక ఏ విధంగా రాధికా జీవితం మార్చనున్నది? మరో పక్క, ప్రియాంక ఎపుడు కూడా అక్క సంతోషాన్ని కోరుకుంటుంది. కానీ తన అక్క జీవితంలో వచ్చే మార్పుల వల్ల తన జీవితం పూర్తిగా మారిపోతే? ఈ నలుగురి జీవితం క్షణక్షణం ఏవిధమైన మలుపులు తిరుగుతాయో తెలియాలంటే 'అగ్నిపరీక్ష' చూడాలి.

అమర్ పాత్రలో నటిస్తున్న ఆకర్ష్ బైరాముడి మాట్లాడుతూ, "ఒక నటుడిగా నేను ఎపుడు కూడా వైవిధ్యమైన పాత్రలో నటించాలని కోరుకుంటాను. అలాంటి పాత్రే అమర్. తనలో ఎన్నో రకాల షేడ్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక పాత్ర తోటి, మల్లి జీ తెలుగు ద్వారా అందరి ముందుకు రావడం నాకు చాల సంతోషంగా ఉంది. ఈ సీరియల్ ను అందరు ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తున్నాను."

పగ, ద్వేశాలతో రగిలిపోతున్న మనసులలో రాధిక మరియు ప్రియాంక ప్రేమను నింపగలరా తెలుసుకోవాలంటే 'తప్పక చూడండి – ‘అగ్నిపరీక్ష' అక్టోబర్ 18 నుండి రాత్రి 9 :30 గంటలకు మీ జీ తెలుగులో ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz