close
Choose your channels

ఆర్తి అగర్వాల్ బాటలో నయనతార వెళుతుందా?

Thursday, April 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌ద‌కొండేళ్ల క్రితం అందాల తార ఆర్తి అగ‌ర్వాల్ ఓ క్రెడిట్‌ని త‌న సొంతం చేసుకుంది. మ‌ళ్లీ ఇప్పుడు అదే దిశ‌గా మ‌రో తార ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ తార మ‌రెవ‌రో కాదు న‌య‌న‌తార‌. ఇంత‌కీ ఆ క్రెడిట్ ఏమిటంటే.. విక్ట‌రీ వెంక‌టేష్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారీ విజ‌యం సొంతం చేసుకోవ‌డం. 'నువ్వు నాకు న‌చ్చావ్‌', 'వ‌సంతం', 'సంక్రాంతి'.. ఇలా వెంకీతో న‌టించిన ప్ర‌తిసారీ త‌న ఖాతాలో ఓ విజ‌యం వేసుకుంది అప్ప‌టి సంచ‌ల‌న తార ఆర్తి అగ‌ర్వాల్‌.

ఆ త‌రువాత శ్రియ‌, త్రిష లాంటి వారు మూడేసి సార్లు వెంక‌టేష్ తో జ‌త‌క‌ట్టినా ఇలా వ‌రుస‌గా విజ‌యాల‌ను మాత్రం త‌మ జాబితాలో వేసుకోలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో 'ల‌క్ష్మీ', 'తుల‌సి' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను వెంకీ కాంబినేష‌న్‌లో అందుకున్న న‌య‌న 'బాబు బంగారం'తో మూడో ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి ఆర్తి బాట‌లోనే న‌య‌న‌ కూడా వెళుతుందో లేదో తెలియాలంటే జులై వ‌రకు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.