close
Choose your channels

Teja Sajja :సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా.. కొత్త సినిమా గ్లింప్స్ గూస్‌బంప్స్ అంతే..

Thursday, April 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ యువహీరో తేజ సజ్జా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. దీంతో తన తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం ప్రకటన విడుదల చేశారు. సూర్య వర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో సూపర్ యోధగా కనిపించనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌తో పాటు గ్లింప్ల్స్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు 'మిరాయ్' (Mirai) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మిరాయ్ అంటే భవిష్యత్ అని అర్థం.

మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం అనంత‌రం పశ్చాతాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్ర‌స్తుతం ఆప‌ద‌లో ఉంటుంది. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు సిద్ధమవుతాడు. ఆ యోధుడి పాత్రలో తేజ నటిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట దూసుకుపోతుంది. ఇందులో తేజ స‌జ్జా స్టెలిష్‌ మేక్‌ ఓవర్‌తో సూపర్‌యోధగా క‌నిపిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ మూవీ భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నాడు.

కాగా ఈ ఏడాది సంకాంత్రి కానుకగా జ‌న‌వ‌రి 12న రిలీజైన హనుమాన్ సినిమా రూ.300కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. తెలుగు వర్షన్ జీ5లో.. మిగిలిన భాషల వర్షన్స్ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి బుల్లి తెర మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జై హనుమాన్’ అంటూ సీక్వెల్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ సీక్వెల్ మూవీలో ఆంజనేయ స్వామి సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టారు. కాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఆంజనేయస్వామి రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని విడుదల చేశారు. ఈ మూవీలో తేజ సజ్జా హనుమంతు పాత్రలోనే నటిస్తుండగా.. ఆంజనేయస్వామి పాత్రలో స్టార్ హీరో నటించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.