close
Choose your channels

అభినేత్రి సెన్సార్ పూర్తి..!

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ భారీ చిత్రం తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో దాదాపు 70 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలును పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ స‌భ్యులు అభినేత్రి చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...సెన్సార్ స‌భ్యుల నుంచి మా అభినేత్రి చిత్రానికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అక్టోబ‌ర్ 7 నుంచి ఫ‌న్ మొద‌లవుతుంది థ్యాంక్యు అంటూ అభినేత్రి స‌క్సెస్ పై త‌న‌కున్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు. మ‌రి..కోన కాన్పిడెన్స్ ఎంత వ‌ర‌కు నిజ‌మౌతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.