close
Choose your channels

బాహుబలి 2 ట్రైలర్ రివ్యూ...

Thursday, March 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన సినిమా బాహుబ‌లి. ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందింది. బాహుబ‌లి పార్ట్ 1 విడుద‌లై బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క‌నువిని ఎరుగ‌ని రీతిలో ఆరు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డేలా చేసిన పార్ట్‌1తో అస‌లు పార్ట్ 2 ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి క్రియేట్ అయ్యింది.
ఆడియెన్స్ అంచ‌నాల‌ను ఆస‌క్తిని బాహుబ‌లి2 రీచ్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఏప్రిల్ 28 వ‌ర‌కు ఆగాల్సిందే..అయితే అంత‌కు ముందుగానే విడుద‌లైన బాహుబ‌లి 2 ట్రైల‌ర్ సినిమా రేంజ్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పింది.
ట్రైల‌ర్ నిడివి 2 నిమిషాల 20 సెక‌న్లు..
ట్రైల‌ర్ ప్రార‌రంభంలో మ‌హిష్మ‌తి రాజ్యాన్ని త‌న విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో అందంగా చూపించ‌డంతో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది.
అమ‌రేంద్ర బాహుబ‌లి అను నేను అశేష మ‌హిష్మ‌తి రాజ్య ప్ర‌జ‌ల ధ‌న‌, మాన‌, ప్రాణాల కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడ‌న‌ని రాజ‌మాత శివ‌గామిపై ప్ర‌మాణం చేస్తున్నాన‌నే ప్ర‌భాస్ వాయిస్‌తో చెప్పే డైలాగ్‌..కిర‌టీంపై చేతితో నొక్కిన‌ప్పుడు వ‌చ్చే ర‌క్తం సీన్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది.
సెంథిల్ సినిమాటోగ్ర‌ఫీ, క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాను అద్భుతంగా ఉంటుంద‌న‌డానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.
నువ్వు నాతో ఉన్నంత వ‌ర‌కు న‌న్ను చంపే మ‌గాడు ఇంకా పుట్ట‌లేదు మామా...అని ప్ర‌భాస్ చెప్పే డైలాగ్‌, అమ‌రేంద్ర బాహుబ‌లి, క‌ట్ట‌ప్ప మ‌ధ్య ఉన్న ఎమోష‌న‌ల్ రిలేష‌న్‌ను చూపిస్తుంది. ఇక రానా టెరిఫిక్ లుక్‌, వార్ సీక్వెన్స్‌లు క‌ళ్ళు చెదిరేలా ఉన్నాయి. చివ‌ర్లో మ‌హేంద్ర బాహుబ‌లి, భ‌ళ్ళాల‌దేవ మ‌ధ్య జ‌రిగే వార్ సీన్‌...వారిద్ద‌రితో ట్రైల‌ర్‌ను ఎండ్ చేసిన విధానం గుజ్ బ‌మ్స్ తెస్తుంది.
దేవ‌సేన అనుష్క‌, అమ‌రేంద్ర బాహుబ‌లి ప్ర‌భాస్ మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. ప్ర‌భాస్‌, త‌మ‌న్నా మ‌ధ్య రొమాంటిక్ సీన్ కంటే వీరి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటుంద‌న‌డంలో డౌట్ లేదు.
శివగామిగా ర‌మ్య‌కృష్ణ‌, క‌ట్ట‌ప్ప‌గా స‌త్య‌రాజ్‌, బిజ్జ‌ల‌దేవ‌గా నాజ‌ర్‌, భ‌ళ్ళాల‌దేవుడుగా రానా ఇలా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఓ ఎమోష‌న్‌ను క్యారీ చేశాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.
ట్రైల‌ర్ ప్రారంభం నుండి ఎండింగ్ వ‌ర‌కు విన‌ప‌డే బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది.
బాహుబ‌లి2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్ష‌కులు గ‌ర్వంగా త‌లెత్తుకునేలా ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునేలా సినిమా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు సుమా....

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.