close
Choose your channels

బాలయ్య సినిమాకు ముహూర్తం కుదిరింది....

Thursday, July 6, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి బాల‌కృష్ణ చాలా వేగంగా సినిమాల‌ను పూర్తి చేసేస్తున్నాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 101వ సినిమా `పైసా వ‌సూల్‌` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న బాల‌య్య 102వ సినిమాను స్టార్ట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, ఎన్నో ముత్తు, న‌ర‌సింహా వంటి ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను అందించిన కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు.

సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలైలో లాంఛ‌నంగా సినిమా ప్రారంభం అవుతుంద‌ని అనుకున్నారు కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను ఆగ‌స్టు 2న ప్రారంభిస్తార‌ట‌. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌నుంది. గ‌తంలో శ్రీరామరాజ్యం, సింహా సినిమాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార క‌లిసి న‌టించ‌బోతున్న చిత్ర‌మిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.